సెకండ్ వన్డే: సౌతాఫ్రికాకు భారీ టార్గెట్

సెకండ్ వన్డే: సౌతాఫ్రికాకు భారీ టార్గెట్

సెకండ్ వన్డేలో సౌతాఫ్రికాకు 288 పరుగుల భారీ టార్గెట్ నిర్దేశించింది భారత్.  రిషబ్ పంత్ 85 పరుగులతో చెలరేగడంతో భారత్  నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. భారత్ ఒపెనర్ కేఎల్ రాహుల్ 55, ,ధావన్29 పరుగులతో మంచి ఓపెనింగ్ ఇచ్చారు. తర్వాత వచ్చిన కోహ్లీ డకౌట్ అయినా.. రిషబ్ పంత్  71 బంతుల్లో 85 రన్స్ చేయడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.  వెంకటేష్ అయ్యార్ 22, శార్దూల్ ఠాకూర్ 40, అశ్విన్ 25, శ్రేయస్ అయ్యర్ 11, చేసి సౌతాఫ్రికాకు 288 పరుగుల టార్గెట్ ను నిర్దేశించారు. సౌతాఫ్రికా బౌలర్లలో  మగలా, మర్క్రమ్,మహారాజ్ లకు తలో ఒక వికెట్ షంసీకి రెండు వికెట్లు పడ్డాయి.

అనంతరం చేజింగ్ కు దిగిన సౌతాఫ్రికా నిలకడగా ఆడుతోంది. 8 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా52పరుగులు చేసింది. క్వింటాన్ డికాక్ 39,మలాన్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు.