
కేప్‌టౌన్: సీనియర్ ప్లేయర్లు రిటైరైన తర్వాత సౌతాఫ్రికా వీక్‌గా మారింది. సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ గెలిచేందుకు ఇదే కరెక్ట్ టైమ్. వన్డేల్లో మనకు తిరుగులేదు. ఈ టూర్ ముందు ఇండియాపై అంచనాలివి.కానీ, మన టీమ్ ఇంత చెత్తగా ఆడుతుందని.. టెస్టుల్లో ఓడిపోయి వన్డేల్లో వైట్‌వాష్ ముంగిట నిలుస్తుందని సఫారీలు సైతం ఎక్స్‌పెక్ట్ చేసి ఉండరు..! రెండు మూడేళ్లుగా ఫారిన్‌లో తిరుగులేని ఆట చూపెట్టిన ఇండియా.. స్టార్లు లేని సౌతాఫ్రికా చేతిలో వైట్‌వాష్ అయితే అంతకంటే అవమానం మరోటి ఉండదు. ఫ్యూచర్‌లో ఇండియా కెప్టెన్సీ ఆశిస్తున్న కేఎల్ రాహుల్ కెరీర్‌పై, కొత్త కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై ఇది బ్యాడ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఇక్కడ జరిగే మూడో వన్డేలో గెలుపు అటు కెప్టెన్, కోచ్‌తో పాటు ఇండియాకు అత్యవసరం. అందుకోసం డిఫరెంట్ కాంబినేషన్‌తో బరిలోకి దిగే చాన్సుంది.
బౌలర్లు రాణిస్తేనే
ఇండియా వికెట్లను పోలిన బొలాండ్ పార్క్ గ్రౌండ్‌లో రాహుల్సేనపై రెండు మ్యాచ్‌ల్లోనూ సౌతాఫ్రికా కంప్లీట్ డామినేషన్ చూపెట్టింది. ఇప్పుడు వేదిక కేప్‌టౌన్‌కు మారగా ఇండియా అప్రోచ్ కూడా మారాల్సిందే. ఎందుకంటే ఫస్ట్ రెండు మ్యాచ్‌ల్లో ఇండియా స్ట్రాటజీ పూర్తిగా ఫెయిలైంది. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో జోరు కొనసాగించడంలో బ్యాటర్లు చెతులెత్తేస్తే.. బౌలింగ్ యూనిట్ అయితే తీవ్రంగా నిరాశ పరిచింది. బుమ్రా తప్పితే మరే బౌలర్ కూడా వికెట్లు తీయాలన్న కసితో బౌలింగ్ చేసినట్టు అనిపించలేదు. రెండు మ్యాచ్‌ల్లో కేవలం 7 వికెట్లు పడగొట్టగలిగారు. సౌతాఫ్రికా మాత్రం14 వికెట్లు పడగొట్టింది. రెండు టీమ్స్ పెర్ఫామెన్స్‌లో ఇదే మెయిన్ రీజన్. ఇండియాలో సీనియర్ మోస్ట్ బౌలర్లైన స్పిన్నర్ అశ్విన్, భువనేశ్వర్ ఆపోజిట్ ప్లేయర్లను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు. ప్రొటీస్ యంగ్‌బ్యాటర్లు డుసెన్, మలన్.. సీనియర్ డికాక్ వీళ్లను ఆడారు. అశ్విన్, భువీ ఫ్లాప్ షో చేయడంతో కోచ్ రాహుల్ ద్రవిడ్... ఈ మ్యాచ్‌లో జయంత్ యాదవ్, దీపక్ చహర్‌ను బరిలోకి దింపే అవకాశం లేకపోలేదు. ఇక, ఫస్ట్ టెస్టులో మ్యాచ్ విన్నింగ్ పెర్ఫామెన్స్ తప్పితే స్టాండిన్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు ఈ సిరీస్ ఓ పీడకల అనొచ్చు. అతని ప్లాన్స్ ఏమీ వర్కౌట్ కాలేదు. సెకండ్ మ్యాచ్‌లో ఫిఫ్టీ కొట్టినా తన స్టయిల్‌కు భిన్నంగా స్లోగా ఆడటం దెబ్బకొట్టింది. ఇప్పుడు కేప్‌టౌన్‌లోని న్యూల్యాండ్స్ స్టేడియం పిచ్‌పై ఎక్కువ పేస్, బౌన్స్ లభిస్తుంది. ఫ్యూచర్ లాంగ్‌టర్మ్ లీడర్ అనుకుంటున్న లోకేశ్ టీమ్‌ను గెలిపించేందుకు ఎలాంటి ప్లానింగ్‌తో వస్తాడో చూడాలి.
అయ్యర్ అండ్ అయ్యర్.. ఇట్ల ఆడితే కష్టమే
ధవన్, రాహుల్, పంత్, ఠాకూర్ బ్యాటింగ్‌లో రాణిస్తున్నారు. వీళ్లు అదే జోరు కొనసాగిస్తే మంచిది. లాస్ట్ మ్యాచ్‌లో డకౌటైనా కోహ్లీ వెంటనే కమ్‌బ్యాక్ చేయాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే, మిడిల్ ఓవర్లలో ఇండియాను దెబ్బకొట్టింది మాత్రం ఇద్దరు అయ్యర్లే. బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ రెండు మ్యాచ్‌ల్లోనూ ఫెయిలయ్యారు. మిడిల్ ఓవర్లలో నిలకడగా స్కోరు చేయడం వల్లే ఇంగ్లండ్ వన్డేల్లో సాలిడ్ టీమ్‌గా మారింది. ఇప్పుడు సౌతాఫ్రికా యంగ్ బ్యాటర్లు సైతం అదే బాటలో నడుస్తుండగా.. ఇండియాలో ఇదే మిస్ అవుతోంది. ఈ విషయంలో తక్షణమే మెరుగవ్వాలి. ఈ మ్యాచ్‌లో శ్రేయస్, వెంకటేశ్‌లో ఒకరిని తప్పించి సూర్యకుమార్‌ను ఆడించే చాన్సుంది. వర్క్‌లోడ్ దృష్ట్యా బుమ్రాకు రెస్ట్ ఇచ్చి సిరాజ్‌ను తీసుకోవచ్చు.
సఫారీలకు గోల్డెన్ చాన్స్..
వరుసగా రెండు మ్యాచ్‌ల్లో భారీ విక్టరీలతో సౌతాఫ్రికా చాలా కాన్ఫి డెన్స్‌తో ఉంది. మిడిలార్డర్‌కు తోడు టాపార్డర్‌లో డికాక్, మలన్ టచ్‌లోకి రావడంతో ఆ టీమ్ బలం రెట్టింపైంది. బౌలింగ్‌లో హోమ్‌టీమ్‌కు ఎదురులేదు. ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి ఇండియా ను వైట్‌వాష్ చేస్తే ఈ సిరీస్ సౌతాఫ్రికా క్రికెట్ హిస్టరీలో నిలిచిపోవడం ఖాయం. ఈ గోల్డెన్ చాన్స్‌ను అస్సలు మిస్ చేసుకోవద్దని చూస్తోందా టీమ్.
కోహ్లీ ఎనర్జీ రాహుల్‌లో మిస్
అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకొని ఓ బ్యాటర్‌గా బరిలోకి దిగిన కోహ్లీ ఫస్ట్ వన్డేలో ఫిఫ్టీతో రాణించాడు. కానీ, మునుపటిలా ఫీల్డ్‌లో అతని ఎనర్జీ కనిపించడం లేదు. గ్రౌండ్‌లో ఏ మూలలో ఉన్నా టీమ్‌మేట్స్ అందరిలో తను జోష్ నింపేవాడు. ఇప్పుడు మాత్రం మ్యాచ్‌లో ఎక్కువ ఇన్వాల్వ్ అవకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా ఎదగాలని కోహ్లీ కోరుకోవడంలో తప్పేం లేదు. కానీ, కెప్టెన్‌గా కోహ్లీలోని ఎనర్జీ రాహుల్‌లో కనిపించడం లేదు. ఓ సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న విరాట్..ఫీల్డ్‌లో చాలా ఎనర్జీ తీసుకొస్తాడు. యంగ్‌స్టర్స్‌లో ఉత్సాహం నింపుతాడు. గత రెండు మ్యాచ్‌ల్లో ఇది మిస్సయింది. కాబట్టి టీమ్‌ను లీడ్ చేస్తున్న లోకేశ్.. మాజీ కెప్టెన్‌లా మిగతా ప్లేయర్లలో జోష్ నింపే ప్రయత్నం చేస్తే మంచిది.