
అమన్ (జోర్డాన్): ఆసియా అండర్–15, 17 బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఇండియన్ బాక్సర్లు పతకాల మోత మోగించారు. మంగళవారం రాత్రి జరిగిన అండర్–15 విమెన్స్‌లో 10 స్వర్ణాలు, 4 కాంస్యాలతో కలిపి మొత్తం 25 మెడల్స్ సాధించారు. బరిలోకి దిగిన 15 వెయిట్ కేటగిరీల్లో కేవలం ఒక్కరు మాత్రమే పతకం లేకుండా వచ్చారు.
అండర్–15 ఫైనల్లో కోమల్ (30–33 కేజీ) 3–2తో అయిరు ఒంగార్బెక్ (కజకిస్తాన్)పై, ఖుషి అహ్లవత్ (35 కేజీ) 4–1తో, తమన్న (37 కేజీ) ఆర్‌ఎస్‌సీ ద్వారా తమ ప్రత్యర్థులపై విజయాలు సాధించారు. మిల్కీ మీనమ్ (43 కేజీ), ప్రిన్సి (52 కేజీ), నవ్య (58 కేజీ), సునైనా (61 కేజీ), ట్రుషానా మోహితే (67 కేజీ), వాన్షికా (70+) ఏకగ్రీవంగా తమ ప్రత్యర్థులపై నెగ్గారు. మెన్స్ ఫైనల్లో నలుగురు బాక్సర్లు బరిలోకి దిగితే శంకర్ వినోద్ (35 కేజీ) గోల్డ్ గెలవగా, ముగ్గురు సిల్వర్ మెడల్స్‌తో సరిపెట్టుకున్నారు. మరో ఏడు కేటగిరీల్లో బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి.
అండర్–17లో రుద్రాక్ష్ సింగ్ ఖైడెమ్ (46 కేజీ), అభిజీత్ (46 కేజీ), లక్ష్యయ్ ఫోగట్ (64 కేజీ).. వరుసగా ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్, ఇరాక్ ప్రత్యర్థుల చేతిలో ఓడి సిల్వర్ మెడల్స్‌తో సంతృప్తి పడ్డారు. మరో ఏడుగురు బాక్సర్లు గోల్డ్ మెడల్
రేసులో ఉన్నారు.