
సుహ్ల్ (జర్మనీ): ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్‌లో ఇండియా బోణీ చేసింది. మంగళవారం జరిగిన మెన్స్ 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్‌లో నేషనల్ చాంపియన్ అడ్రియన్ కర్మాకర్ డెబ్యూ టోర్నీలోనే 626.7 పాయింట్లతో రెండో ప్లేస్‌లో నిలిచి సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు.
హోరాహోరీగా సాగిన ఫైనల్లో జెస్పర్ జోహన్సెన్ (స్వీడన్) చేతిలో 0.3 పాయింట్ల తేడాతో అడ్రియన్ గోల్డ్ మిస్సయ్యాడు. గ్రిఫిన్ (అమెరికా) 624.6 పాయింట్లతో బ్రాంజ్‌ను సాధించాడు.
ఇంతకుముందు ఎప్పుడూ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఇండియాకు ప్రాతినిధ్యం వహించలేకపోయిన అడ్రియన్ ఈ టోర్నీలో మాత్రం అద్భుతమైన గురితో ఆకట్టుకున్నాడు. ఇక రోహిత్ కన్యన్ (620.6), వేదాంత్ నితిన్ వాగ్మారే (614.4) వరుసగా 12, 35వ స్థానాల్లో నిలిచారు.