కాంతులు వెదజల్లుతూ జెమినిడ్స్ ఉల్కాపాతం

కాంతులు వెదజల్లుతూ జెమినిడ్స్ ఉల్కాపాతం

ఆకాశంలో కాంతులు వెదజల్లుతూ జెమినిడ్స్ ఉల్కాపాతం జరిగింది. ఈ నెల 4 నుంచి ఆకాశంలో కనిపిస్తున్న జెమినిడ్స్ ఉల్కాపాతం ఇవాళ గరిష్ఠస్థాయికి చేరిందని ప్లానెటరీ సొసైటీ ఇండియా వ్యవస్థాపక కార్యదర్శి, డైరెక్టర్ ఎస్.రఘునందన్ రావు తెలిపారు. రాత్రి 9 గంటల తర్వాత ఉల్కాపాతం మరింత స్పష్టంగా కనిపించిందన్నారు. ఈ సంవత్సరం చివరి ఉల్కాపాతం భూమికి అత్యంత దగ్గరగా వచ్చిందని చెప్పారు. డిసెంబరు 17 వరకు ఉల్కాపాతం కనిపిస్తుందన్నారు. వీటిని డైరెక్ట్ గా చూస్తే ఎలాంటి ముప్పు ఉండదని రఘు  అన్నారు.