ఇండియా విమెన్స్ హాకీ టీమ్ కోచ్ హరేంద్ర రాజీనామా

ఇండియా విమెన్స్ హాకీ టీమ్ కోచ్ హరేంద్ర రాజీనామా

న్యూఢిల్లీ: ఇండియా విమెన్స్ హాకీ  టీమ్ హెడ్ కోచ్‌‌ హరేంద్ర సింగ్ సోమవారం రాజీనామా చేశాడు. వ్యక్తిగత కారణాలను పేర్కొంటూ అతను తక్షణమే పదవి నుంచి వైదొలగినట్లు హాకీ ఇండియా వర్గాలు తెలిపాయి. 2016లో జూనియర్ మెన్స్ వరల్డ్ కప్‌‌ను గెలిచిన జట్టుకు కోచ్‌‌గా వ్యవహరించిన హరేంద్ర  గతేడాది ఏప్రిల్‌‌లో మహిళల జట్టు బాధ్యతలు స్వీకరించాడు. అయితే, అతని పదవీకాలంలో జట్టు ఆట ఆశించిన స్థాయిలో లేదు.

ఎఫ్‌‌ఐహెచ్ ప్రో లీగ్ 2024-25లో ఆడిన 16 మ్యాచ్‌‌ల్లో కేవలం రెండింటిలోనే గెలిచి తదుపరి సీజన్‌‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. హరేంద్ర తప్పుకోవడంతో జట్టుకు కొత్త చీఫ్‌‌ కోచ్‌‌గా నెదర్లాండ్స్‌‌కు చెందిన సోర్డ్ మరినె తిరిగి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరినె  కోచింగ్‌‌లోనే ఇండియా అమ్మాయిల జట్టు 2021 టోక్యో ఒలింపిక్స్‌‌లో చారిత్రాత్మక నాలుగో స్థానాన్ని దక్కించుకుంది.