ఏకైక టెస్ట్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఇండియాతో ఆస్ట్రేలియా ఢీ

ఏకైక టెస్ట్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఇండియాతో ఆస్ట్రేలియా ఢీ

ముంబై: ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌తో జరిగిన ఏకైక టెస్ట్‌‌‌‌‌‌‌‌లో ఈజీగా నెగ్గిన ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ అసలు పరీక్షకు రెడీ అయ్యింది. గురువారం నుంచి జరిగే ఏకైక టెస్ట్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో బలమైన ఆస్ట్రేలియాతో తలపడనుంది. గత 46 ఏళ్లలో ఆసీస్‌‌‌‌‌‌‌‌తో ఆడిన 10 టెస్ట్‌‌‌‌‌‌‌‌ల్లో ఇండియా ఒక్క మ్యాచ్‌‌‌‌‌‌‌‌ కూడా నెగ్గలేదు. దీంతో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌పై చూపెట్టిన ఫామ్‌‌‌‌‌‌‌‌ను కొనసాగించి కంగారూలను ఓడించి ‘తొలి విజయాన్ని’ ఖాతాలో వేసుకోవాలని హర్మన్‌‌‌‌‌‌‌‌సేన లక్ష్యంగా పెట్టుకుంది. 

ఇందుకోసం మళ్లీ స్పిన్నర్లపై ఎక్కువగా ఆధారపడుతోంది. ఆఫ్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ దీప్తి శర్మపై భారీ ఆశలు పెట్టుకున్నారు. పేసర్లు రేణుకా సింగ్‌‌‌‌‌‌‌‌, పూజా వస్త్రాకర్‌‌‌‌‌‌‌‌ కూడా మెరిస్తే ఇండియాకు ఇబ్బందుల్లేనట్లే. బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో కెప్టెన్‌‌‌‌‌‌‌‌ హర్మన్‌‌‌‌‌‌‌‌, జెమీమా, యాస్తికా భాటియా ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉండటం కలిసొచ్చే అంశం. అయితే స్టార్‌‌‌‌‌‌‌‌ ఓపెనర్‌‌‌‌‌‌‌‌ స్మృతి మంధానా గాడిలో పడాల్సిన అవసరం చాలా ఉంది. 

మరోవైపు 40 ఏళ్ల తర్వాత ఇండియా గడ్డపై టెస్ట్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ ఆడుతున్న ఆసీస్‌‌‌‌‌‌‌‌ కూడా ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నది. కొత్త కెప్టెన్‌‌‌‌‌‌‌‌ అలీసా హీలీ నేతృత్వంలో టీమ్‌‌‌‌‌‌‌‌ విక్టరీ టార్గెట్‌‌‌‌‌‌‌‌తో ముందుకొస్తున్నది. రెండేళ్ల కిందట కర్రారాలో జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను ఇండియా డ్రాతో ముగించింది. ఎలీసా పెర్రీ, ఆష్లే గార్గెనర్‌‌‌‌‌‌‌‌, బెత్‌‌‌‌‌‌‌‌ మూనీ, తాహ్లియా మెక్‌‌‌‌‌‌‌‌గ్రాత్‌‌‌‌‌‌‌‌లాంటి ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్లు ఉండటం కంగారూలకు కొండంత బలం.