రైఫిల్ షూటింగ్ వరల్డ్ కప్‌లో భారత్‌కు 15 బంగారు పతకాలు

రైఫిల్ షూటింగ్ వరల్డ్ కప్‌లో భారత్‌కు 15 బంగారు పతకాలు
  • మొత్తం 30 పతకాలతో టోర్నీలోనే అగ్రస్థానంలో భారత్
  • 8 పతకాలతో రెండో స్థానంలో అమెరికా

న్యూఢిల్లీ: ఐఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌ రైఫిల్ షూటింగ్‌‌‌‌ వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో ఇండియా షూటర్ల జోరు కొనసాగుతోంది. ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ పోటీల్లో భారత్ ఏకంగా 15 బంగారు పతకాలు సాధించింది. సొంత గడ్డపై జరుగుతున్న ఈ టోర్నీలో  మొత్తం 30 పతకాలతో భారత్  టోర్నీలో ఎవరికీ అందనంత ఎత్తులో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన ట్రాప్ ఈవెంట్స్ లో పురుషులు, మహిళల విభాగాల్లో బంగారు పతకాలు సాధించారు భారత షూటర్లు. మహిళల‌‌‌ 25 మీటర్ల పిస్టల్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌ను మనోళ్లు క్లీన్‌‌‌‌స్వీప్‌‌‌‌ చేయగా.. పురుషఉల‌‌‌ 50 మీటర్స్‌‌‌‌ రైఫిల్‌‌‌‌ త్రీ పొజిషన్స్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో ఐశ్వరీ ప్రతాప్‌‌‌‌ సింగ్‌‌‌‌ తోమర్‌‌‌‌ ఇండియాకు తొలి గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌ అందించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ప్రపంచ కప్ టోర్నీలో బంగారు పతకం సాధించిన అతి పిన్న వయస్కుడిగా 20 ఏళ్ల తోమర్​ రికార్డు సృష్టించిన ఊపు మొత్తం టోర్నీలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు మొత్తం 30 పతకాలతో అగ్రస్థానంలో నిలిచిన భారత్ .. వాటిలో 15 బంగారు పతకాలుండగా.. మరో 9 వెండి, ఆరు కాంస్య పతకాలు ఉన్నాయి. టోర్నీ పతకాల పట్టికలో భారత్ 30 పతకాలతో అగ్రస్థానంలో ఉండగా.. అమెరికా రెండో స్థానంలో నిలిచింది. అమెరికా మొత్తం 8 పతకాలు సాధించగా.. వాటిలో నాలుగ బంగారు పతకాలు మరో మూడు రజత పతకాలు.. ఒక కాంస్య పతకం ఉంది. ఇటలీ, డెన్మార్క్ తదితర దేశాల ఆటగాళ్లు చావో రేవో తేల్చుకునే రీతిలో కఠోర సాధన చేస్తున్నారు. ఏది ఏమైనా వరల్డ్ కప్  టోర్నీ రేపు ముగియనున్న నేపధ్యంలో భారత్ మరిన్ని పతకాలు సాధించే పరిస్థితి కనిపిస్తోంది. సొంత గడ్డపై జరిగిన టోర్నీలో గతంలో ఎన్నడూ లేని రీతిలో భారత జట్టు అరుదైన రికార్డులతో మంచి ప్రతిభ కనబరుస్తూ.. పతకాలు సాధిస్తూ అగ్రస్థానంలో కొనసాగుతుండడం విశేషం. ఈ ఊపు భవిష్యత్తులో మారుమూల ప్రాంతాలకు కూడా రైఫిల్ షూటింగ్ టోర్నీలు విస్తరించే అవకాశం ఉందని నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ పతకాల పట్టిక

దేశం        బంగారు పతకాలు     వెండి పతకాలు   కాంస్య పతకాలు   మొత్తం పతకాలు

భారత్             15                       9                  6                   30
యూఎస్ఏ        4                        3                  1                    8
ఇటలీ               2                        -                   2                    4
డెన్మార్క్           2                        -                   1                    3
పోలండ్            1                        3                  3                     7