కామన్ వెల్త్ క్రీడల్లో భారత్ కు మరో పతకం

కామన్ వెల్త్ క్రీడల్లో భారత్ కు మరో పతకం

బర్మింగ్ హామ్ లో జరుగుతున్న కామన్ వెల్త్ క్రీడల్లో భారత్ కు మరో పతకం దక్కింది. వెయిట్ లిఫ్టర్ హర్జిందర్ కౌర్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. మహిళల 71 కిలోల విభాగంలో తలపడిన హర్జీందర్ కౌర్ ..  మొత్తం 212 కిలోల బరువు ఎత్తింది. స్నాచ్ లో 93 కిలోల ఎత్తిన హర్జిందర్ కౌర్.. క్లీన్ అండ్ జర్క్ లో 119 కిలోలు ఎత్తి కాంస్య పతకం గెలిచింది. ఈ ఏడాది కామన్ వెల్త్ క్రీడల్లో భారత్ కు ఇప్పటి వరకు మొత్తం 9 పతకాలు దక్కగా.. వాటిలో ఏడు పతకాలు వెయిల్ లిఫ్టింగ్ లోనే వచ్చాయి.

ప్రధాని మోడీ అభినందనలు
కాంస్యం గెలుచుకున్న వెయిట్‌లిఫ్టర్ హర్జిందర్ కౌర్ ను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. ఇటు పలువురు ప్రముఖులు కూడా హర్జిందర్ కౌర్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మరోవైపు హర్జిందర్ కౌర్ సొంతూరులోనూ సంబరాలు అంబరాన్నంటాయి.