మూడ్రోజుల్లోనే ముగించిన్రు..తొలి టెస్టులో భారత్ గ్రాండ్ విక్టరీ

మూడ్రోజుల్లోనే ముగించిన్రు..తొలి టెస్టులో భారత్ గ్రాండ్ విక్టరీ

వెస్టిండీస్ తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో  గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో గెలిచింది.  భారత స్పిన్నర్లు జడేజా, రవిచంద్ర అశ్విన్ దెబ్బకు  కరీబియన్లు పెవిలియన్ కు క్యూ కట్టారు.  రెండో ఇన్నింగ్స్ లో  వెస్టిండీస్  130కే ఆలౌట్ అయ్యింది. అశ్విన్ 7,  జడేజా2 సిరాజ్ ఒక వికెట్ తీశారు.  ఐదు రోజుల టెస్టును మూడు రోజుల్లోనే ముగించారు. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ 150, రెండో ఇన్నింగ్స్  130, భారత్ తొలి ఇన్నింగ్స్  421/5డిక్లేర్.

మూడో రోజు  భారత్ తొలి ఇన్నింగ్స్ ను 421/5 కు డిక్లేర్ చేసింది. ఓపెనర్లు  యశస్వి జైశ్వాల్ 171, రోహిత్ శర్మ 103, కొహ్లీ 76, రవీంద్ర జడేజా 37 పరుగులు చేసి 421 పరుగులకు ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ కు దిగిన వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ 7, జడేజా 2 వికెట్లతో చెలరేగారు.   అలిక్ అథనేజ్ 28, జాసన్ హోల్డర్ 20, అల్జారీ జోసెఫ్ 13, జోమెల్ వర్రికన్ 18, రేమాన్ 11 పరుగులు మాత్రమే చేశారు. దీంతో  వెస్టిండీస్ 130 కే ఆలౌట్ అయ్యింది.  ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో మట్టికరిపించింది.