ట్విట్టర్ టాప్ హ్యాష్‌‌‌‌‌‌‌‌ట్యాగ్‌‌‌‌‌‌‌‌ల జాబితాలో ఇండియన్ యాక్టర్‌‌‌‌‌‌‌‌గా ప్రభాస్

ట్విట్టర్ టాప్ హ్యాష్‌‌‌‌‌‌‌‌ట్యాగ్‌‌‌‌‌‌‌‌ల జాబితాలో  ఇండియన్ యాక్టర్‌‌‌‌‌‌‌‌గా ప్రభాస్

‘సలార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’తో ఆకట్టుకున్న ప్రభాస్‌‌‌‌‌‌‌‌, ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కల్కి 2898 ఎడి’ మే నెలలో రిలీజ్‌‌‌‌‌‌‌‌కు రెడీ అవుతోంది. మరోవైపు ‘రాజా సాబ్‌‌‌‌‌‌‌‌’ తెరకెక్కుతోంది. సలార్ 2, స్పిరిట్‌‌‌‌‌‌‌‌ చిత్రాలు క్యూ లైన్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. దీంతో తన సినిమాలకు సంబంధించిన చిన్న అప్‌‌‌‌‌‌‌‌డేట్ వచ్చినా అది టాప్‌‌‌‌‌‌‌‌ ట్రెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉంటోంది.

తాజాగా భారత్‌‌‌‌‌‌‌‌లోని టాప్ హ్యాష్‌‌‌‌‌‌‌‌ట్యాగ్‌‌‌‌‌‌‌‌ల జాబితాను ట్విట్టర్ విడుదల చేసింది.  ఇందులోని టాప్ 10 హ్యాష్ ట్యాగ్‌‌‌‌‌‌‌‌లలో నిలిచిన ఏకైక ఇండియన్ యాక్టర్‌‌‌‌‌‌‌‌గా ప్రభాస్ నిలిచాడు. అంతేకాదు.. ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం కూడా ఈ టాప్ టెన్‌‌‌‌‌‌‌‌ లిస్టులో చోటు దక్కించుకుంది. తమ ఫేవరేట్ స్టార్ పేరు టాప్ హ్యాష్ ట్యాగ్స్‌‌‌‌‌‌‌‌లో రావడంతో ప్రభాస్ అభిమానులు హ్యాపీ అవుతున్నారు. అలాగే విజయ్ ‘లియో’, షారుక్ ఖాన్ ‘జవాన్, పఠాన్‌‌‌‌‌‌‌‌ చిత్రాల హ్యాష్‌‌‌‌‌‌‌‌ట్యాగ్స్‌‌‌‌‌‌‌‌ టాప్‌‌‌‌‌‌‌‌ టెన్ లిస్టులో ఉన్నాయి.