తప్పిపోయిన IAF విమానం: 13మంది ఆచూకీ గల్లంతు

తప్పిపోయిన IAF విమానం: 13మంది ఆచూకీ గల్లంతు

భారత వాయుసేనకు చెందిన ట్రాన్స్ పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ తప్పిపోయింది. AN-32 అనే విమానం అస్సాం లోని  జొర్ హత్ ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే  ఆచూకీ కనిపించకుండా పోయింది. ఇందులో 13 మంది వైమానిక  సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.

అస్సాంలోని జొర్హట్ నుంచి అరుణాచల్ ప్రదేశ్, వెస్ట్ సియాంగ్ జిల్లా మెచుకా అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్ కు మధ్యాహ్నం 12.24 నిమిషాలకు ఈ ఎయిర్ క్రాఫ్ట్ బయలుదేరింది. అయితే.. మధ్యాహ్నం 1గంట తర్వాత AN32 విమానానికి గ్రౌండ్ కు సంబంధాలు తెగిపోయాయి. దీంతో AN32 విమానం కోసం గాలిస్తున్నారు IAF  సిబ్బంది.