ఎయిర్​ ఫోర్స్ జాబ్స్: నోటిఫికేషన్ జారీ

ఎయిర్​ ఫోర్స్ జాబ్స్: నోటిఫికేషన్ జారీ

భారత వాయుసేన అగ్నిపథ్‌‌ యోజనలో భాగంగా అగ్నివీర్‌‌ వాయు నియామకాలకు సంబంధించి సంక్షిప్త ఇన్‌‌టేక్‌‌ నోటిషికేషన్‌‌ విడుదల చేసింది. అగ్నివీర్ వాయు(01/ 2023) ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఐఏఎఫ్‌‌ ఆన్‌‌లైన్‌‌ అప్లికేషన్స్​ కోరుతోంది.

అర్హత: మ్యాథ్స్​, ఫిజిక్స్‌‌, ఇంగ్లిష్‌‌ సబ్జెక్టులతో ఇంటర్​(10+2)/ మూడేళ్ల ఇంజినీరింగ్‌‌ డిప్లొమా ఉండాలి. ఫిజికల్​ మెజర్​మెంట్​,  వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి. వయసు 23 ఏళ్లు మించకూడదు. ఆన్‌‌లైన్ రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌‌నెస్ టెస్ట్, మెడికల్ ఫిట్‌‌నెస్ టెస్ట్ ఆధారంగా సెలెక్షన్​ ప్రాసెస్​ ఉంటుంది.

దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్‌‌లైన్​లో నవంబర్​ మొదటివారం నుంచి దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌‌లైన్ పరీక్ష జనవరి 2న నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు www.agnipathvayu.cdac.in వెబ్​సైట్ సంప్రదించాలి.