ఇండియన్ ఎయిర్‌లైన్స్ చరిత్రలో తొలిసారి.. సీఈఓగా ఓ మహిళ

ఇండియన్ ఎయిర్‌లైన్స్ చరిత్రలో తొలిసారి.. సీఈఓగా ఓ మహిళ

భారత విమానయాన సంస్థ మొదటిసారిగా ఓ మహిళను సీఈఓగా నియమించింది. ఎయిర్ ఇండియా యొక్క ప్రాంతీయ అనుబంధ సంస్థ అలయన్స్ ఎయిర్‌కు CEOగా హర్‌ప్రీత్ దే సింగ్‌ను నియమించారు. ఎయిర్ ఇండియా సీఎండీ రాజీవ్ బన్సాల్ శుక్రవారం ఈ ఉత్తర్వులను జారీ చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు అలయన్స్ ఎయిర్ సీఈఓగా హర్‌ప్రీత్ బాధ్యతలు నిర్వర్తిస్తారని ఆయన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

హర్‌ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఎయిర్ ఇండియా యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమెను సీఈఓగా నియమించడంతో ఆమె స్థానంలోకి కొత్త EDగా కెప్టెన్ నివేదా భాసిన్‌ను నియమించనున్నాను. నివేదా భాసిన్ విమానయాన సంస్థ బోయింగ్ 787కు పనిచేస్తున్న అత్యంత సీనియర్ కమాండర్లలో ఒకరు. కెప్టెన్ నివేదా భాసిన్‌కు ఉన్న అనుభవాన్ని బట్టి ఆమెను ఇతర విభాగాలకు కూడా నాయకత్వం వహించాలని కోరారు.

ఎయిర్ ఇండియా ఎంపిక చేసిన మొదటి మహిళా పైలట్‌గా హర్‌ప్రీత్ సింగ్ నిలిచారు. ఆమె 1988లో విమానాయాన రంగంలోకి ప్రవేశించారు. ఆరోగ్య కారణాల వల్ల ఆమె పైలట్‌గా పనిచేయలేదు. కానీ, విమాన భద్రత విషయంలో ఆమె పనిచేసింది. ప్రస్తుతం హర్‌ప్రీత్ సింగ్ ఇండియన్ ఉమెన్ పైలట్ అసోసియేషన్‌కు నేతృత్వం వహిస్తున్నారు. ఈ అసోసియేషన్లో భాసిన్ మరియు కెప్టెన్ క్షమాతా బాజ్‌పాయ్ వంటి ఇతర సీనియర్ మహిళా కమాండర్లు కూడా ఉన్నారు.

For More News..

వీడియో: ఒకే క్రీజులోకి పరుగు తీసిన ఇద్దరు బ్యాట్‌మెన్స్.. ఒకరు అవుట్..

వీడియో: స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద సర్దార్‌కు నివాళులు అర్పించిన ప్రధాని

టీ20ల్లో వెయ్యి సిక్సర్లు కొట్టిన ఫస్ట్‌‌ క్రికెటర్