15 వేల అడుగుల ఎత్తులో ఇండియన్ ఆర్మీ యోగా

15 వేల అడుగుల ఎత్తులో ఇండియన్ ఆర్మీ యోగా

దేశవ్యాప్తంగా ప్రజలు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. చాలా రాష్ట్రాల్లో ప్రజలు, నేతలు యోగా దినోత్సవంలో పాల్గొంటున్నారు. ఉత్తర సిక్కింలోని ముగుతాంగ్ సబ్ సెక్టార్‌లో 15,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో యోగా చేశారు. భారత ఆర్మీ సిబ్బంది మంచుతో కూడిన  ఎత్తులో యోగా చేశారు .

మరోవైపు  జమ్మూకశ్మీర్ శ్రీనగర్ లో జరిగిన యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ప్రధాని మోదీ. శేర్ ఐ కశ్మీర్ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ సెంటర్లో యోగా చేశారు.  అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు పదేళ్లు పూర్తి అయ్యాయన్నారు. యోగాకు చేసిన సేవలకు గానూ నూట ఒక్క ఏళ్ల ఫ్రాన్స్ టీచర్ కు పద్మశ్రీ అవార్డు దక్కిందన్నారు. దేశ,విదేశాల్లోని యూనివర్సిటీల్లో యోగాపై రీసెర్చీలు జరుగుతున్నాయని తెలిపారు. దేశ ప్రజలకు ఇంటర్నేషనల్ యోగా డే విషెస్ చెప్పారు మోదీ. 

2014లో నరేంద్ర మోదీ తొలిసారి ప్రధాని అయినప్పుడు, ఆ ఏడాది సెప్టెంబర్‌లో ఐక్యరాజ్యసమితిలో చేసిన ప్రసంగంలో యోగా వల్ల కలిగే ప్రయోజనాల గురించి మోదీ మాట్లాడారు. యోగాను జరుపుకునేందుకు ప్రత్యేక రోజును నిర్ణయించాలని ఆయన సూచించారు. దీంతో  జూన్ 21వ తేదీని ప్రపంచ  యోగా డేగా నిర్ణయించారు.   2015లో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో 177 దేశాలు పాల్గొన్నాయి. అప్పటి నుండి, యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అన్ని వయసుల వారు యోగా పాల్గొంటున్నారు.