మంచు కొండల కింద చిక్కుకున్న30 మంది

మంచు కొండల కింద చిక్కుకున్న30 మంది

శ్రీనగర్: జమ్ము కశ్మీర్ లో రెండు మంచు కొండలు విరిగిపడి 30 మంది సామాన్యులు చిక్కుకుపోయారు. సోమవారం రాత్రి నేషనల్ హైవే 701పై వెళ్తుండగా.. చౌకీబాల్ , తంగ్ధార్ మధ్య ఉన్నట్టుండి భారీ హిమపాతం కురవడం, రెండు మంచు కొండలు కుప్పకూలడంతో వేర్వేరు వెహికల్స్ లో వెళ్తున్న వారు సడన్ గా చిక్కుబడిపోయారు. దీనికి  సంబంధించి సమాచారం తెలియగానే ఇండియన్ ఆర్మీ, జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్ కలిసి రెస్క్యూ ఆపరేషన్ షురూ చేశారు.  అర్ధరాత్రి తర్వాత వారిని సురక్షితంగా కాపాడినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.

వాతావరణం ఏ మాత్రం అనుకూలించకపోయినప్పటికీ తీవ్రంగా శ్రమించి.. బాధితులను సేఫ్ గా బయటకు తీశామన్నారు. 14 మందిని నీలమ్ ఏరియాకు, మరో 16 మందిని ఎన్సీ పాస్ కు చేర్చామని అధికారులు చెప్పారు. రెస్క్యూ చేసిన అనంతరం వారికి అవసరమైన వైద్య సాయంతో పాటు ఆహారం అందించామని ఆర్మీ అధికారులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ మొత్తం ఐదారు గంటలకు పైగా సమయం పట్టిందన్నారు.

మరిన్ని వార్తల కోసం..

తెలంగాణ హెల్త్ డైరెక్టర్ కరోనా పాజిటివ్

ఆన్లైన్లో పెళ్లి.. అతిధుల ఇంటికే భోజనం

అప్పుడు నవ్వారు..