ఆన్లైన్లో పెళ్లి.. అతిథుల ఇంటికే భోజనం..

ఆన్లైన్లో పెళ్లి.. అతిథుల ఇంటికే భోజనం..

బెంగాల్: కరోనా మహమ్మారి పుణ్యమాని ధూంధాంగా పెళ్లి చేసుకునే రోజులు పోయాయి.  కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వాలు ఆంక్షలు కఠినం చేశాయి. పెళ్లిళ్లకు హాజరయ్యే అతిథుల సంఖ్యపై పరిమితి విధించడంతో దగ్గరి బంధువులు, స్నేహితుల సమక్షంలోనే పెళ్లిళ్లు కానిచ్చేస్తున్నారు. కానీ బెంగాల్కు చెందిన ఓ జంట మాత్రం తమ పెళ్లిని అంగరంగ వైభవంగా చేసుకోవాలని డిసైడయ్యారు. కొవిడ్ రూల్స్ అతిక్రమించకుండానే 450 గెస్ట్ లను పెళ్లికి ఆహ్వానించడంతో పాటు అందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేశారు. 

బెంగాల్ బుర్ద్వాన్ కు చెందిన సందీపన్ సర్కార్, అదితి దాస్కు గతేడాది పెళ్లి కుదిరింది. కానీ కరోనా కారణంగా పెళ్లి తేదీ వాయిదాపడుతూ వస్తోంది. 2022లో ఎలాగైనా ఒక్కటవ్వాలని డిసైడైన ఆ జంట జనవరి 24న ముహూర్తం ఖరారు చేసుకున్నారు. పెళ్లి సాదాసీదాగా కాకుండా 450 మంది గెస్టులతో ధూంధాంగా చేసుకోవాలని డిసైడైన ఈ జంట.. ఇందుకోసం గూగుల్ మీట్ను నమ్ముకుంది. పెళ్లికి 100 నుంచి 120 మంది ప్రత్యక్షంగా హాజరుకానుండగా.. మరో 300మందికిపైగా అతిథులు గూగుల్ మీట్ లైవ్ టెలికాస్ట్ ద్వారా పెళ్లి చూసేలా ప్లాన్ చేశారు. ఇందుకోసం పెళ్లికి ఒక రోజు ముందు బంధుమిత్రులకు గూగుల్ మీట్ లింక్ షేర్ చేయనున్నారు. అంతేకాదు పెళ్లి రోజున బంధువులందరికీ జొమాటో ద్వారా వర్చువల్ అతిథులందరికీ విందు భోజనం అందించే ఏర్పాట్లు చేశారు. 

బెంగాల్లో పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలకు 200మంది వరకు హాజరయ్యేందుకు ప్రభుత్వం అనుమతించింది. అయితే పెళ్లి కొడుకు సందీపన్ ఈ నెల 2న కరోనా బారినపడటంతో మూడు రోజుల పాటు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. దీంతో పెళ్లికి 200 పిలిస్తే వారిలో ఎవరైనా కరోనా బారినపడే అవకాశముందని భావించిన సందీపన్ వివాహానికి ప్రత్యక్షంగా హాజరయ్యే గెస్ట్ ల సంఖ్యను 100కు పరిమితం చేశాడు. మిగతా వారంతా వర్చువల్గా పెళ్లి చూసేలా ఏర్పాట్లు చేశాడు. ఇక కరోనా కష్టకాలంతో వినూత్నంగా ఆలోచించిన ఈ జంట పెళ్లిని ప్రమోట్ చేయాలని జొమాటో నిర్ణయించింది. అంతేకాదు వర్చువల్గా వివాహానికి హాజరయ్యే అతిథులకు పంపే భోజనాల డెలివరిని మానిటర్ చేసేందుకు ప్రత్యేక టీం ఏర్పాటు చేసింది.

ఇవి కూడా చదవండి..

అప్పుడు నవ్వారు.. ఇప్పుడు కష్టాలు చెప్పుకుని ఏడుస్తున్నరు

25 మంది క్రిమినల్స్ కు బీజేపీ టికెట్