Adani News: ఆపరేషన్ సిందూర్‌లో అదానీ డ్రోన్స్ వాడిన ఆర్మీ.. ప్రత్యేకతలు ఇవే..

Adani News: ఆపరేషన్ సిందూర్‌లో అదానీ డ్రోన్స్ వాడిన ఆర్మీ.. ప్రత్యేకతలు ఇవే..

Sky Strikers: నిన్న తెల్లవారుజామున మెుదటి దాడిని చేపట్టిన భారత్ ఆపరేషన్ సిందూర్ ను ప్రస్తుతం కొనసాగిస్తోంది. ఇండియాలోని అనేక నగరాలపై పాక్ సైన్యం మిస్సైల్ దాడులకు తెగబడతా వాటిని సమర్థవంతంగా తిప్పికొడుతూనే డ్రోన్ల సాయంతో మరిన్ని దాడులకు భారత్ దిగిందని వెల్లడైంది. ఈ క్రమంలో పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్, రావల్పిండి క్రికెట్ స్టేడియంపై కూడా డ్రోన్ దాడులను నిర్వహించింది. 

అయితే ఇప్పుడు అందరి దృష్టి భారత సాయుధదళాలు సిందూర్ దాడుల్లో ఉపయోగించిన డ్రోన్లపై పడింది. వివరాల్లోకి వెళితే ప్రస్తుతం దాడుల్లో ఉపయోగిస్తున్న స్కై స్ట్రైకర్స్ అనే అధునాతన డ్రోన్లను అదానీకి చెందిన ఆల్ఫా సిస్టమ్స్ సంస్థ తయారు చేసినవి కావటం గమనార్హం. 2018లో అదానీ గ్రూప్ ఈ కంపెనీని స్థాపించగా.. భారత ఆర్మీ రక్షణకోసం వీటిని సరఫరా చేస్తోంది. వీటిలో 5 కేజీలు లేదా 10 కేజీల మందుగుండును తీసుకువెళ్లేందుకు వీలుగా డిజైన్ చేసినట్లు వెల్లడైంది. 

ప్రస్తుతం స్కై స్ట్రైకర్ డ్రోన్లను బెంగళూరులో అదానీ గ్రూప్ సంస్థ ఇజ్రాయెల్ కు చెందిన ఎల్బిట్ సెక్యూరిటీ సిస్టమ్స్ సంయుక్తంగా తయారు చేస్తున్నాయి. ఇది 100 కిలోమీటర్ల పరిధిలో ఉండే శత్రునిర్మాణాలపై దాడి చేసేందుకు రూపొందించబడ్డాయని వెల్లడైంది. 2021 నుంచి అత్యవసర నిర్ణయంతో 100 డ్రోన్లను భారత మిలిటరీ ఆర్డర్ చేసింది. ప్రస్తుతం ఈ అత్యాధునిక ఇజ్రాయెల్ సాంకేతికత కలిగిన డ్రోన్లు సిందూర్ పేరుపై చేస్తున్న ఆపరేషన్లో కీలక పాత్ర పోషిస్తూ భారతదేశానికి విజయాన్ని అందిస్తున్నాయి.

సాయుధ దశాలు శత్రువులపై చేస్తున్న దాడుల్లో ఖచ్చితత్వంతో పాటు విజయాన్ని సాధించటానికి స్క్రై స్ట్రైకర్స్ అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నాయని మిలిటరీ నిపుణులు చెబుతున్నారు. దీంతో భారత్ తన భూభాగం నుంచి శత్రుదేశంలోని కీలకమైన ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసేందుకు వీలు కలుగుతోంది.