
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఖాతాలో మరో మెడల్ చేరింది. ఉమెన్స్ 10వేల మీటర్ల రేస్ వాక్‌లో భారత అథ్లెట్ ప్రియాంక గోస్వామి సిల్వర్ మెడల్‌ను సొంతం చేసుకుంది. 43:38.82 సెకన్లలో 10వేల రేసును పూర్తి చేసిన ప్రియాంక రెండో స్థానంతో రజతాన్ని దక్కించుకుంది. ఈ విజయంతో ప్రియాంక గోస్వామి సరికొత్త రికార్డును నెలకొల్పింది. కామన్వెల్త్ రేస్ వాక్‌లో మెడల్ సాధించిన తొలి ఇండియన్ అథ్లెట్‌గా ప్రియాంక గోస్వామి నిలిచింది.
రేసు ప్రారంభం అయిన కొద్దిసేపటికే ప్రియాంక ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అందరికంటే ముందు 4 వేల మీటర్ల మార్కును చేరి మొదటి స్థానంలో నిలిచింది. ఈ సమయంలోనే ఆస్ట్రేలియాకు చెందిన జెమిమా మోంటాగ్, కెన్యాకు చెందిన ఎమిలీ వాముస్యి ఎన్గీలను వెనక్కి నెట్టింది. ఆ తర్వాత 8వేల మీటర్లు ముగిసే సమయానికి ప్రియాంక మూడో స్థానానికి పడిపోయింది. అయితే చివరి నిమిషంలో 2వేల మీటర్ల స్కోర్‌ను అత్యంత వేగంగా పూర్తి చేసింది. అయితే ప్రియాంక కంటే ముందు మోంటాగ్ 42:38 సెకన్లతో గోల్డ్ మెడల్‌ను గెలిచుకోగా..ప్రియాంక రెండో స్థానంతో సిల్వర్ ను దక్కించుకుంది. ఈ రేసులో మరో భారత ప్లేయర్ భావా జాట్ 8వ స్థానంలో నిలిచింది.
కామన్వెల్త్ లో సిల్వర్ సాధించడం సంతోషంగా ఉందని అథ్లెట్ ప్రియాంక గోస్వామి తెలిపింది. ఈ పతకాన్ని లడ్డూ గోపాల్‌తో పాటు తన కుటుంబానికి అంకితమిస్తున్నట్లు చెప్పింది. ఆసియా క్రీడలు, ఒలింపిక్సే తన టార్గెట్ అని చెప్పుకొచ్చింది. ఈ ఏడాది టోర్నీలు ఆడేందుకు వెళ్లిన దేశాల జాతీయ పతాకాలను నెయిల్స్‌పై పెయింట్‌గా వేసుకుంది.
Asian games and Olympics next. My nail paint symbolises all the countries I went to, this year for the Olympics & other tournaments. I dedicate my medal to my 'Laddoo Gopal' & my family, said India's Priyanka Goswami, after winning silver in the Women's 10,000m Race Walk finals pic.twitter.com/H4Sewcf6De
— ANI (@ANI) August 6, 2022
టోక్యో ఒలింపిక్స్‌లోనూ ప్రియాంక గోస్వామి దేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఈ గేమ్స్ లో ప్రియాంక 17వ స్థానంతో సరిపెట్టుకుంది. కానీ ప్రస్తుత కామన్వెల్త్ గేమ్స్ లో మాత్రం అద్భుత ప్రదర్శనతో రజత పతకాన్ని గెలుచుకుంది. ఆ తర్వాత 2021లో 20వేల మీటర్ల రేసులో ఇండియన్ రేస్‌వాకింగ్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. ఈ రేసును 1:28.45 నిమిషాల్లో పూర్తి చేసి కొత్త రికార్డును నెలకొల్పింది.
Whole nation is extremely proud of @Priyanka_Goswam who won Silver Medal in 10,000 Mtr Race Walk at the #CommonwealthGames !
— Kiren Rijiju (@KirenRijiju) August 6, 2022
Congratulations Priyanka for making India proud ??#Cheer4India #India4CWG2022 pic.twitter.com/u2lZeCRiGX