రక్షించిన భారత కోస్ట్​గార్డ్​

రక్షించిన భారత కోస్ట్​గార్డ్​

బీజింగ్​: అరేబియా సముద్రంలో ప్రయాణిస్తున్న షిప్​లోని వ్యక్తి గుండెపోటుకు గురయ్యాడు. అతడిని ఇండియన్​ కోస్ట్​గార్డ్​ సిబ్బంది ప్రాణాలకు తెగించి కాపాడారు. ఈ విషయాన్ని భారత రక్షణ శాఖ వెల్లడించింది. చైనాకు చెందిన షిప్​ తీరానికి 200 కి.మీలో ఉన్న టైంలో అందులో పనిచేస్తున్న వీగ్​యాంగ్​ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.

 కార్డియాక్​ అరెస్ట్​గా గుర్తించి అక్కడున్న వారు అధికారులకు తెలిపారు. సమాచారం అందుకున్న కోస్ట్​గార్డ్​ హెలికాప్టర్​తో రంగంలోకి దిగింది. చిమ్మ చీకటి, ప్రతికూల వాతావరణాన్ని సైతం లెక్కచేయకుండా సహాయక చర్యలు చేపట్టింది. ఎయిర్​లిఫ్ట్​ సహాయంతో అతడిని హెలికాప్టర్​లోకి ఎక్కించి అక్కడినుంచి ఆస్పత్రికి తరలించింది.