ఇండియన్ కోస్ట్ గార్డ్ మెకానికల్ ఫిట్టర్, ఎంటీఎస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు.
పోస్టులు: మెకానికల్ ఫిట్టర్ (నైపుణ్యం కలిగిన ట్రేడ్స్‌మన్) 01, ఎంటీఎస్ (ప్యూన్) 01, ఎంటీఎస్ (స్వీపర్) 01.
ఎలిజిబిలిటీ: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, అప్రెంటీస్ షిప్, పదోతరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పని అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి: 18 నుంచి 27 ఏండ్ల మధ్యలో ఉండాలి.
లాస్ట్ డేట్: జనవరి 20.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్‌లిస్ట్, రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి సమాచారం కోసం https://indiancoastguard.gov.in/ వెబ్ సైట్ చూడొచ్చు.
