
భారతీయ కంపెనీ నాయిస్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ప్రపంచంలో 3 మిలియన్ ప్రొడక్ట్స్ (స్మార్ట్ వాచ్, ఇయర్ బడ్స్) అమ్మిన మొదటి బ్రాండ్ గా నిలిచింది. తక్కువ ధరలో మంచి ప్రొడక్ట్స్ తీసుకొచ్చే నాయిస్ కు ప్రపంచ వ్యాప్తంగా కస్టమర్లు ఉన్నారు. ఈ ఘనత సాధించిన సందర్భంగా నాయిస్ కంపెనీ ఒక ప్రకటన చేసింది. నిన్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా మేకిన్ ఇండియా ప్రోగ్రామ్ లో భాగంగా 90 శాతం నాయిస్ ప్రొడక్ట్స్ ని భారత్ లో తయారుచేయాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయంతో భారత ఎకానమీకి మెరుగుపడనుంది. తాజాగా బ్లూమ్ బర్గ్ ఇచ్చిన నివేదికలో నాయిస్ ఇయర్ బడ్స్ ఎక్కువ అమ్ముడుపోయిన జాబితాలో నిలిచింది.