
దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం నాటి కేసులతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 30 లక్షల మార్కును దాటింది. తాజాగా గత 24 గంటల్లో 69,239 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ మరియు సంక్షేమ శాఖ తెలిపింది. దాంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 30,44,941కి చేరింది. ఇందులో 7,07,668 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా బారినపడి కోలుకున్న వారిసంఖ్య 22,80,567గా ఉంది. శనివారం దేశవ్యాప్తంగా 912 మంది కరోనాతో మరణించారు. దాంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 56,706కు చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో శనివారం 8,01,147 కరోనా టెస్టులు చేశారు. దాంతో మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 3,52,92,220కి చేరింది.
ఆగష్టు 7న కరోనా కేసుల సంఖ్య 20 లక్షల మార్కును దాటింది. అంటే ఆగష్టు 7 నుంచి ఆగష్టు 22 వరకు కేవలం 16 రోజుల్లోనే మరో 10 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి.