అమెరికాలో మనోడి దారుణ హత్య.. కత్తితో తల నరికి చెత్తబుట్టలో పారేసిన దుండగుడు

అమెరికాలో మనోడి దారుణ హత్య.. కత్తితో తల నరికి చెత్తబుట్టలో పారేసిన దుండగుడు
  • వాషింగ్‌‌‌‌ మెషీన్‌‌‌‌ వాడొద్దనడంతో మొదలైన గొడవ
  •     వెంటాడి పలుమార్లు పొడిచి ప్రాణం తీసిన హంతకుడు
  •     టెక్సస్‌‌‌‌లోని డల్లాస్‌‌‌‌ హోటల్​ ముందు హత్య..    సీసీటీవీ ఫుటేజీలో బయటపడ్డ ఘోరం

వాషింగ్టన్: మనదేశానికి చెందిన వ్యక్తి అమెరికాలో దారుణ హత్యకు గురయ్యాడు. కర్నాటకకు చెందిన చంద్ర నాగమల్లయ్యను అతడి భార్య, కొడుకు ముందే దుండగుడు తల నరికి చంపేశాడు. శుక్రవారం (సెప్టెంబర్ 12) టెక్సస్‌‌‌‌లోని డల్లాస్‌‌‌‌లో ఈ ఘోరం జరిగింది. క్యూబాకు చెందిన నిందితుడు కత్తి పట్టుకుని బాధితుడిని వెంబడిస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్‌‌‌‌ మీడియాలో వైరల్‌‌‌‌ గా మారింది.

భార్య, కొడుకు కండ్లముందే ప్రాణం తీసిండు.. 

కర్నాటకకు చెందిన చంద్ర నాగమల్లయ్య(50) భార్య, కొడుకుతో కలిసి డల్లాస్‌‌‌‌లో ఉంటున్నారు. డౌన్‌‌‌‌టౌన్‌‌‌‌లోని సామ్యూల్‌‌‌‌ బౌలేవార్డ్‌‌‌‌లో ఒక హోటల్‌‌‌‌లో పనిచేస్తున్నారు. క్యూబాకు చెందిన వలసదారుడు యోర్డానిక్‌‌‌‌ కోబోస్‌‌‌‌ మార్టినెజ్‌‌‌‌(37) కూడా కొంతకాలంగా అదే హోటల్‌‌‌‌లో పనిచేస్తున్నాడు. వీళ్లిద్దరి మధ్య శుక్రవారం ఓ చిన్న విషయంపై వివాదం తలెత్తింది. 

నిందితుడు యోర్డానిక్‌‌‌‌ హోటల్‌‌‌‌లోని ఓ రూమ్‌‌‌‌ క్లీన్‌‌‌‌ చేస్తున్న టైంలో.. వాషింగ్‌‌‌‌మెషీన్‌‌‌‌ విరిగిపోయిందని, దానిని వాడొద్దని యోర్డానిక్‌‌‌‌కు చెప్పడంతో గొడవ మొదలైంది. అదికూడా నాగమల్లయ్య తనకు డైరెక్ట్‌‌‌‌గా చెప్పకుండా మరో మహిళా ఉద్యోగితో చెప్పించడం యోర్డానిక్‌‌‌‌కు ఆగ్రహం తెప్పించింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇదే క్రమంలో కంట్రోల్‌‌‌‌ తప్పిన యోర్డానిక్‌‌‌‌.. నాగమల్లయ్యపై కత్తితో దాడి చేయడం మొదలుపెట్టాడు. ఆయన అరుపులు విని అక్కడే ఉన్న నాగమల్లయ్య భార్య, 18 ఏండ్ల కొడుకు అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

 వాళ్లను పక్కకు తోసేసిన నిందితుడు.. బయటకు పరిగెత్తిన నాగమల్లయ్యను కత్తితో వెంబడించాడు. హోటల్‌‌‌‌ కారిడార్లో దొరికించుకుని పలుమార్లు పొడిచి చంపేశాడు. ఆపై నాగమల్లయ్య తల నరికి చెత్తబుట్టలో పడేశాడు. కండ్లముందే జరుగుతున్న ఈ ఘోరాన్ని భార్య, కొడుకు ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది.

గతంలో పలు నేరాలు

సమాచారంతో స్పాట్‌‌‌‌కు చేరుకున్న డల్లాస్‌‌‌‌ పోలీసులు నిందితుడిని అరెస్ట్‌‌‌‌ చేశారు. హత్యకు వాడిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. హంతకుడు గతంలోనూ నేరాలు చేసి జైలుపాలయ్యాడని పోలీసులు తెలిపారు. కాలిఫోర్నియా, ఫ్లోరిడా, హూస్టన్‌‌‌‌లో పలుమార్లు అరెస్ట్‌‌‌‌ అయ్యాడని చెప్పారు. ప్రస్తుత నేరానికి కూడా అతడిలో ఎలాంటి పశ్చాత్తాపంలేదని, హత్య తర్వాత.. నరికిన తలను బయటకు తన్నుకుంటూ వచ్చి చెత్తడబ్బాలో పడేశాడని చెప్పారు. దోషిగా రుజువైతే అతడికి మరణశిక్ష లేదా జీవిత ఖైదు పడొచ్చన్నారు. నాగమల్లయ్య మృతిపట్ల హూస్టన్‌‌‌‌లోని ఇండియన్‌‌‌‌ ఎంబసీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతుడి కుటుంబ సభ్యులను సంప్రదించామని, వారికి అన్నివిధాలా సాయం అందిస్తామని చెప్పింది.