టిక్ టాక్ యాప్ ను తమ స్టోర్ల నుంచి తొలగించాలి

టిక్ టాక్ యాప్ ను తమ స్టోర్ల నుంచి తొలగించాలి

చైనా మోబైల్ యాప్ పై భారత ప్రభుత్వం కొరడా ఝులిపించింది. ‘టిక్ టాక్’ మోబైల్ యాప్ ను వెంటనే తమ స్టోర్ల నుంచి తొలగించాలని గూగుల్, యాపిల్ సంస్థలుకు ఆదేశించింది కేంధ్ర ప్రభుత్వం. ఇదివరకే తమిళనాడు హైకోర్టు టిక్ టాక్ ను నిషేధించాలని ఆధేశాలు ఇచ్చింది. దీంతో సుప్రీం కోర్టులో సవాలు చేశారు టిక్ టాక్ అధికారులు. ఈరోజు బేంచ్ ముందుకు టిక్ టాక్ విషయం రాగా.. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించేందుకు సుంప్రీం నిరాకరించింది. దీంతో.. ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ  ‘టిక్ టాక్’ ను గూగుల్ యాప్ స్టోర్ నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ట్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం టిక్ టాక్ పై ఈ రోజు విచారణ చేపట్టింది. తదుపరి విచారణ ఏప్రిల్ 22కు వాయిదా వేసింది.

‘టిక్ టాక్’ వల్ల ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయినట్టుగా కేసులు నమోదయ్యాయి. రెండు రోజుల క్రితం ఢిల్లీలో టిక్ టాక్ వీడియో తీసే క్రమంలో తుపాకీతో తన ఫ్రెండ్ ను కాల్చి చంపాడు ఒకతను. ఇదే కాకుండా పోర్న్ వీడియోలు కూడా టిక్ టాక్ వల్ల ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుతం ఇండియాలో 6కోట్ల మంది టిక్ టాక్ ను వాడుతున్నారు.