
సింగర్ కావాలనుకునేవాళ్ల కలని నిజం చేసే పాటల పోటీల్లో ఇండియన్ ఐడల్ రియాలిటీ షో చాలా పాపులర్. హిందీ ఆడియెన్స్‌తో పాటు అన్ని భాషల ఆడియెన్స్‌ని మస్త్గ ఎంటర్టైన్ చేసే ఈ షో కొత్త సీజన్ రాబోతోంది. ఈమధ్యే ఇండియన్ ఐడల్ 13వ సీజన్‌కి సంబంధించిన ప్రోమో వచ్చింది. అందులో ఒక ఇంటి కుటుంబ సభ్యులంతా ఎవరి పనుల్లో వాళ్లు ఉంటారు. అంతలోనే ఒక చిన్న పాప ఇండియన్ ఐడల్ షో చూద్దామని సోనీ టీవీ ఛానెల్ పెట్టగానే పాట వస్తుంది. ఆ పాట చెవినపడగానే అందరూ తమ పనుల్ని ఎక్కడివక్కడ ఆపేసి టీవీ ముందు కూర్చుంటారు. ‘మళ్లీ ఫ్యామిలీ అంతా రాత్రిపూట ఒకచోట కూర్చొనే టైం వచ్చింది. ఇది సంగీతం వినే కాలం’ అనేది ఇండియన్ ఐడల్ 13వ సీజన్ ట్యాగ్ లైన్. ఇప్పటికే ఢిల్లీ, ముంబైలో జరిగిన ఆడిషన్స్ కి 2,600కు పైగా ఎంట్రీలు వచ్చాయి. ఆదిత్య నారాయణ్ హోస్ట్ చేస్తున్న ఈ షోకి సింగర్ అనూమాలిక్, నేహా కక్కర్, హిమేష్ రేషమ్మియా జడ్జిలు. ఈ షో త్వరలోనే సోనీ టీవీలో టెలికాస్ట్ కానుంది.
ఝలక్ దిక్లాజా....
ఐదేండ్ల తర్వాత ఆడియెన్స్ ముందుకు రాబోతోంది ‘ఝలక్ దిక్లాజా’ డాన్స్ రియాలిటీ షో. ఈ పదో సీజన్లో సినిమా, టీవీ సెలబ్రిటీలు, ఇతర రంగాల్లో సక్సెస్ అయినవాళ్లు డాన్స్ స్టెప్పులతో ఆడియెన్స్‌ని ఎంటర్టైన్ చేయనున్నారు. ఈ షోలో టీవీ నటి శిల్పా షిండే, నియా శర్మ, నీతి టేలర్, చెఫ్ జొరావర్ కర్లా పార్టిసిపేట్ చేయనున్నారు. హీరోయిన్ మాధురీ దీక్షిత్, నోరా ఫతేహి, నిర్మాత కరణ్ జోహర్ జడ్జిలు. ఈ షో సెప్టెంబర్ 2 లేదా 24వ తేదీ నుంచి కలర్స్ టీవీలో టెలికాస్ట్ కానుంది.
బిగ్‌బాస్ 16 లో ఆక్వా థీమ్
హిందీ బిగ్‌బాస్ 16 సీజన్ త్వరలోనే మొదలుకానుంది. ఈసారి కూడా సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా చేయనున్న ఈ సీజన్ స్పెషల్... ఆక్వాథీమ్. 15వ సీజన్లో ఇంటినంతటిని అడవి థీమ్‌తో డెకరేట్ చేశారు. ఈసారి బిగ్‌బాస్ ఇల్లు నీలం రంగులో ఉండనుంది. గోడల మీద, పై కప్పు మీద సముద్ర జంతువులు, ఆల్చిప్పల బొమ్మలు కంటెస్టెంట్స్‌కి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వనున్నాయి. అయితే కంటెస్టెంట్స్ ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. సెప్టెంబర్ చివరి వారం లేదా అక్టోబర్ మొదటి వారంలో ఈ షో కలర్స్ టీవీలో టెలికాస్ట్ అవుతుంది.