బీటెక్, డిగ్రీ అర్హతతో ఐఐటీ హైదరాబాద్‌లో ఉద్యోగాల జాతర! పరీక్ష లేకుండానే ఎంపికయ్యే అవకాశం!

 బీటెక్, డిగ్రీ  అర్హతతో ఐఐటీ హైదరాబాద్‌లో ఉద్యోగాల జాతర! పరీక్ష లేకుండానే ఎంపికయ్యే అవకాశం!

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ (IIT HYDERABAD) బోధనేతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఈ/ బి.టెక్, డిప్లొమా, బీఎస్సీ, బీసీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ, బి.పి.ఎడ్యుకేషన్ అర్హతలు కలిగిన అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం ఖాళీలు: 21. 

విభాగాల వారీగా ఖాళీలు: జూనియర్ ఇంజినీర్ (సివిల్) 1, జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) 1, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్ 2, అకౌంటెంట్ 5, జూనియర్ టెక్నీషియన్ - (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) 1, జూనియర్ టెక్నీషియన్ -( బయోమెడికల్ ఇంజినీరింగ్) 1, జూనియర్ టెక్నీషియన్ - (సెంట్రల్ వర్క్​షాప్) 1, జూనియర్ టెక్నీషియన్ -( కెమికల్ ఇంజినీరింగ్) 1, జూనియర్ టెక్నీషియన్ - (సివిల్ ఇంజినీరింగ్) 1, జూనియర్ టెక్నీషియన్ - (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్) 1, జూనియర్ టెక్నీషియన్ -(ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) 1, జూనియర్ టెక్నీషియన్ - (మెటీరియల్స్ సైన్స్ & మెటలర్జికల్ ఇంజినీరింగ్) 2, జూనియర్ టెక్నీషియన్ ( మ్యాథమెటిక్స్) 1, జూనియర్ టెక్నీషియన్ -( మెకానికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్) 1, జూనియర్ టెక్నీషియన్ -(ఫిజిక్స్) 1.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఎంసీఏ/ ఎంఎస్సీ/ బీఈ/ బి.టెక్/ బీఎస్సీ/ బీసీఏ/ బి.కాం/ డిప్లొమా/ ఐటీఐ పూర్తిచేసి ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి:  35 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: మే 21.

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. 

లాస్ట్ డేట్: జులై 20. 

సెలెక్షన్ ప్రాసెస్:  రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ iith.ac.inను సందర్శించండి.