
ఆంట్వెర్ప్: ఇండియా జూనియర్ హాకీ టీమ్.. యూరోప్ టూర్‌ను విజయంతో మొదలుపెట్టింది. సోమవారం రాత్రి జరిగిన తొలి మ్యాచ్‌లో ఇండియా 4–2 (పెనాల్టీ షూటౌట్)తో బెల్జియంపై గెలిచింది. రెగ్యులర్ టైమ్‌లో ఇండియా తరఫున శారదానంద తివారీ (3, 27వ ని.) రెండు గోల్స్ కొట్టాడు. అయితే థర్డ్ క్వార్టర్‌లో తొలి గోల్ చేసిన బెల్జియం ప్లేయర్లు మ్యాచ్ చివర్లో రెండో పెనాల్టీ గోల్‌తో స్కోరును సమం చేశారు.
దీంతో విన్నర్‌ను తేల్చేందుకు షూటౌట్‌ను నిర్వహించారు. ఇందులో ఇండియా తరఫున గురుజ్యోత్ సింగ్, సౌరభ్ ఆనంద్, దిల్‌రాజ్ సింగ్, మన్మిత్ సింగ్ గోల్స్ చేయగా, గోల్ కీపర్ ప్రిన్స్ దీప్ సింగ్ రెండు గోల్స్‌ను అడ్డుకున్నాడు. బుధవారం బెల్జియంతో ఇండియా రెండో మ్యాచ్ ఆడనుంది.