భారత హాకీ టీమ్ హెడ్ కోచ్‌ రాజీనామా

భారత హాకీ టీమ్ హెడ్ కోచ్‌ రాజీనామా

భారత పురుషుల హాకీ జట్టు ప్రధాన కోచ్ గ్రాహం రీడ్ రాజీనామా చేశాడు. వరల్డ్ కప్‌లో జట్టు దారుణమైన ఓటమికి బాధ్యత వహిస్తూ గ్రాహం రీడ్ తన పదవీకి రాజీనామా చేశాడు. హెడ్ కోచ్ తో పాటుగా అనలిటికల్ కోచ్, సైంటిఫిక్ అడ్వైజర్లు కూడా తమ పదవుల నుంచి తప్పుకున్నారు.  భారత హాకీ జట్టుకుహెడ్ కోచ్‌గా వ్యవహరించడాన్ని తనకు దక్కిన గొప్ప  గౌరవంగా భావిస్తున్నానని గ్రాహం రీడ్ తెలిపాడు. భారత హాకీ టీమ్ భవిష్యత్తులో మరిన్ని విజయాలను అందుకోవాలని కోరుకుంటున్నట్లుగా తెలిపాడు. 

ఆస్ట్రేలియాకు చెందిన గ్రాహం రీడ్ 2019 నుంచి భారత పురుషుల హాకీ జట్టుకి ప్రధాన కోచ్‌గా ఉంటున్నాడు.  అతని కోచింగ్‌లో బారత  హాకీ జట్టు2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించింది. 40 ఏళ్ల తర్వాత భారత్ కు దక్కిన ఒలింపిక్ పతకం ఇది. పురుషుల హాకీ వరల్డ్ కప్ 2023 టోర్నీలో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన భారత హాకీ జట్టు అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమై టోర్నీ మొత్తంలో 9వ స్థానంతో సరిపెట్టుకుంది.