Trump: ట్రంప్ డబుల్ టారిఫ్స్ బాంబ్.. ఆ భారతీయ స్టాక్స్ క్రాష్..

Trump: ట్రంప్ డబుల్ టారిఫ్స్ బాంబ్.. ఆ భారతీయ స్టాక్స్ క్రాష్..

Trump Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుసగా షాక్స్ మీద షాక్స్ ఇస్తూనే ఉన్నాడు. కొన్ని వారాల కిందట ప్రపంచ దేశాలపై వరుస టారిఫ్స్ ప్రకటించిన ఆయన ప్రస్తుతం మరో బాంబు పేల్చారు. ఇది భారత స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. 

ట్రంప్ ఇటీవల స్టీల్, అల్యూమినియం దిగుమతులపై టారిఫ్ రెండింతలు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో జూన్ 4 నుంచి ఈ దిగుమతులపై అమెరికా ఏకంగా 50 శాతం సుంకం విధించాలని నిర్ణయించింది. దీంతో భారత స్టీల్ కంపెనీల షోర్లు ఒక్కసారిగా భేజారాయి. నేడు ఇంట్రాడేలో జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, జిందాల్ స్టీల్, వేదాంత, సెయిల్ సహా మరిన్ని మెటల్ స్టాక్స్ భారీగా ప్రభావితం అయ్యాయి.

ట్రంప్ శుక్రవారం అమెరికాలోని పెన్సిల్వేనియా ఉక్కు కార్మికులతో మాట్లాడుతూ స్థానికి పరిశ్రమను కాపాడేందుకు దిగుమతులపై సుంకాన్ని 50 శాతానికి పెంచుతానని మాటిచ్చారు. దీని తర్వాత తన ట్రూత్ ఖాతాలో దీనిపై అప్డేట్ ఇస్తూ జూన్ 4 నుంచి పెంచబడిన సుంకాలు అమలులోకి వస్తాయని వెల్లడించారు. ఈ సుంకాల విధింపు భారతీయ ఎగుమతిదారులపై... ముఖ్యంగా విలువ ఆధారిత ఉక్కు ఉత్పత్తు, ఆటో భాగాల వ్యాపారంలో నిమగ్నమై ఉన్నవారిపై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

►ALSO READ | IPO News: కలిసిరాని కాలం.. ఐపీవో ఇన్వెస్టర్లకు దెబ్బమీద దెబ్బ.. తుస్సుమన్న లిస్టింగ్

ట్రంప్ తన మెుదటి టర్మ్ సమయంలో మెుదట 2018లో ఉక్కు దిగుమతులపై 25 శాతం, అల్యూమినియం ఉత్పత్తుల దిగుమతులపై 10 శాతం సుంకాలను ప్రకటించారు. ఆ తర్వాత ఫిబ్రవరి 2025లో అల్యూమినియంపై ఉన్న సుంకాలను సైతం 25 శాతానికి పెంచారు. ప్రస్తుతం భారతదేశం నుంచి 2024-25లో అమెరికాకు రూ.40వేల కోట్ల వరకు విలువైన ఉత్పత్తులను ఎగమతి చేసింది. అలాగే ఉక్కు ఎగుమతులకు భారతీయ సంస్థలకు అమెరికా ఒక ప్రధాన వినియోగదారుగా ఉన్న సంగతి తెలిసిందే. 

ఉక్కు, అల్యూమినియంపై అధిక దిగుమతి సుంకాలను వ్యతిరేకిస్తూ వాషింగ్టన్ కు వ్యతిరేకంగా ప్రతీకార చర్యను ప్రతిపాదించిన భారతదేశం మే 9న ప్రపంచ వాణిజ్య సంస్థ వద్ద ఇచ్చిన నోటీసును అమెరికా తిరస్కరించింది. భారత చర్యలు భద్రతా చర్యలు కాదని, అందుకే ఈ విషయంపై న్యూదిల్లీతో ఎటువంటి చర్చను నిర్వహించబోమని అమెరికా చెప్పిందని తెలిసిన వ్యక్తులు ఆదివారం స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఇండియా అమెరికా నుంచి వచ్చే బాదం, వాల్ నట్స్, ఇతర ఖరీదైన లోహాలపై అధిక పన్నులను విధించే అవకాశం ఉందని తెలుస్తోంది.