
న్యూఢిల్లీ: కేరళలోని వయనాడ్‌లో మళ్లీ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండి) హెచ్చరించింది. బుధవారం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బుధవారం కన్నూర్, త్రిస్సూర్, ఎర్నాకులంలలో ఒకటి నుంచి రెండుచోట్ల, గురువారం వయనాడ్, కోజికోడ్‌లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండిఅంచనా వేసింది. లక్షద్వీప్‌కు రెడ్ అలర్ట్ జారీ చేసింది. గురువారం అక్కడ అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో వయనాడ్‌లో జులై 30న 230 మందికి పైగా మరణించారు.
మృతుల కుటుంబాలకు 6 లక్షలు: పినరయి
వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.6 లక్షల నష్టపరిహారాన్ని ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. ఇందులో రూ.4 లక్షలు రాష్ట్ర విపత్తు సహాయ నిధి నుంచి, మిగిలిన మొత్తాన్ని ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధి నుంచి ఇస్తామని
సీఎం పినరయి విజయన్ తెలిపారు.