టెన్షన్లు మరింత పెంచే ఉద్దేశం లేదు : అజిత్​ ధోవల్

టెన్షన్లు మరింత పెంచే ఉద్దేశం లేదు : అజిత్​ ధోవల్
  • తిరిగి దాడి చేస్తే తీవ్రస్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటం
  • పాకిస్తాన్​​కు భారత భద్రతా సలహాదారు వార్నింగ్

న్యూఢిల్లీ: పాకిస్తాన్​లోని ఉగ్రవాద స్థావరాలపై ‘ఆపరేషన్​ సిందూర్’ ఎటాక్​ తర్వాత ఆ దేశానికి భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్​ దోవల్ ​సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ ఉద్రిక్తతలను మరింత పెంచే ఉద్దేశం తమకు లేదని.. పాకిస్తాన్ కనుక భారత్​పై దాడులు చేయాలని నిర్ణయించుకుంటే మరింత తీవ్రస్థాయిలో  ప్రతీకారం తీర్చుకునేందుకు రెడీగా ఉన్నామని హెచ్చరించారు. ఇండియా దాడుల తర్వాత పాక్ నేతలు ప్రతిదాడులు చేస్తామని బెదిరింపుకు పాల్పడిన నేపథ్యంలో బుధవారం ఆయన ఈ ప్రకటన చేశారు. పాకిస్తాన్, ఆ దేశ సైన్యం లక్ష్యంగా ఎటాక్ చేసే ఆలోచన తమకులేదని కేవలం టెర్రరిస్టు క్యాంపులే టార్గెట్​గా దాడులు చేశామన్నారు. 

ఆపరేషన్‌‌ సిందూర్​ను ప్రణాళికాబద్ధంగా నిర్వహించినట్లు చెప్పారు. దాడులు కచ్చితమైనవి, నియంత్రితమైనవని పేర్కొన్నారు. అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, యూఏఈ, రష్యా తదితర ప్రపంచ దేశాల ప్రతినిధులతో మాట్లాడి దాడుల విషయం వివరించారు. ఈ దాడులు ఉగ్రవాదంపై లక్ష్యంగా సాగాయని.. పౌరులు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదని వెల్లడించారు.