ఇండియన్​ నేవీలో సివిలియన్​ పోస్టులు

ఇండియన్​ నేవీలో సివిలియన్​ పోస్టులు

ఇండియన్ నేవీ- సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్‌‌ను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 910 ఛార్జ్‌‌మ్యాన్, సీనియర్ డ్రాఫ్ట్స్‌‌మ్యాన్, ట్రేడ్స్‌‌మ్యాన్ మేట్ పోస్టులు భర్తీ కానున్నాయి. 

ఖాళీలు:  జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ ‘బి (ఎన్‌‌జీ)’, నాన్ గెజిటెడ్, ఇండస్ట్రియల్, నాన్ మినిస్టీరియల్ విభాగంలో ఛార్జ్‌‌మ్యాన్ (అమ్యూనిషన్‌‌ వర్క్‌‌షాప్): 22 పోస్టులు, ఛార్జ్‌‌మ్యాన్ (ఫ్యాక్టరీ): 20, సీనియర్ డ్రాఫ్ట్స్‌‌మ్యాన్ (ఎలక్ట్రికల్): 142, సీనియర్ డ్రాఫ్ట్స్‌‌మ్యాన్ (మెకానికల్): 26, సీనియర్ డ్రాఫ్ట్స్‌‌మ్యాన్ (కన్‌‌స్ట్రక్షన్‌‌): 29, సీనియర్ డ్రాఫ్ట్స్‌‌మ్యాన్ (కార్టోగ్రాఫిక్): 11, సీనియర్ డ్రాఫ్ట్స్‌‌మ్యాన్ (ఆర్మమెంట్): 50  పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ ‘సి’, నాన్ గెజిటెడ్, ఇండస్ట్రియల్ విభాగంలో ట్రేడ్స్‌‌మ్యాన్ మేట్ పోస్టులు 610 ఉన్నాయి.

ట్రేడులు: కార్పెంటర్, సీవోపీఏ, డ్రెస్ మేకింగ్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఫౌండ్రీమ్యాన్, ఎలక్ట్రోప్లేటర్, ఇండస్ట్రియల్ పెయింటర్, ప్లంబర్, సర్వేయర్ తదితరాలు ఉన్నాయి.
అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసుఛార్జ్‌‌మ్యాన్/ ట్రేడ్స్‌‌మ్యాన్ మేట్ పోస్టులకు 25 ఏళ్లు. సీనియర్ డ్రాఫ్ట్స్‌‌మ్యాన్ పోస్టులకు 27 సంవత్సరాలు మించరాదు.

సెలెక్షన్​: అప్లికేషన్‌‌ స్క్రీనింగ్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఫైనల్​ సెలెక్షన్​ ఉంటంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్​ 18 నుంచి డిసెంబర్​ 31 మధ్య అప్లయ్ చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.joinindiannavy.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.