హైదరాబాద్‌లో అలరించిన ఇండియన్ నేవీ మ్యూజికల్ కన్సర్ట్

హైదరాబాద్‌లో  అలరించిన ఇండియన్ నేవీ మ్యూజికల్ కన్సర్ట్

భారత నౌకా దళ దినోత్సవం సందర్భంగా గురువారం సాయంత్రం ఇండియన్ నేవీ బ్యాండ్ విభాగం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ మార్గ్​లోని బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన మ్యూజికల్ కన్సర్ట్ ఉత్సాహంగా సాగింది. ఇండియన్ నేవీకి చెందిన 36 మంది తెలుగు, వెస్ట్రర్న్ పాటలతో అలరించారు.

తెలంగాణ ప్రభుత్వం సహకారంతో నేవీ స్టేషన్ కమాండర్ రావ్నిష్ సేథ ఆధ్వర్యంలో ఈ కన్సర్ట్ ను నిర్వహించారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి శృతి ఓజా, వివిధ శాఖల అధికారులు, భారత నౌకాదళ సిబ్బంది పాల్గొన్నారు. 

 - వెలుగు , హైదరాబాద్