
ఇండియన్ నేవీ 362 ట్రేడ్స్‌మెన్ మేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి అనంతరం ఐటీఐ కోర్సులు పూర్తిచేసినవారు వీటికి పోటీపడవచ్చు. ఎంపికైనవారు అండమాన్ అండ్ నికోబార్ కమాండ్‌లో విధులు నిర్వర్తించాలి.
ట్రేడులు: కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రోప్లేటర్, ఫిట్టర్, ఫౌండ్రీమ్యాన్, మెషినిస్ట్, మెరైన్ ఫిట్టర్, మెకానిక్ డీజిల్, ప్లంబర్, వెల్డర్, వైర్‌మ్యాన్, టైలర్.
అర్హత: పదోతరగతితోపాటు నిర్దేశిత ట్రేడుల్లో ఐటీఐ సర్టిఫికెట్ అవసరం. 52 ట్రేడుల్లో ఎందులోనైనా ఏడాది లేదా రెండేళ్ల కోర్సు పూర్తి చేసుకుంటే అప్లై చేసుకోవచ్చు. సెప్టెంబరు 25, 2023 నాటికి వయసు 18 నుంచి -25 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.
డ్యూటీ‑జీతం: ఉద్యోగంలో చేరినవారికి రూ.18,000 బేసిక్ సాలరీ లభిస్తుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఏ.. అన్నీ కలిపి రూ.30 వేల వరకు ప్రారంభ వేతనం పొందవచ్చు. వీరు ప్రధానంగా సబ్‌మెరైన్లు, షిప్పుల ఉత్పత్తి/ నిర్వహణ విధుల్లో పాల్గొంటారు.
సెలెక్షన్: రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.
దరఖాస్తులు: ఆగస్టు 26 ఉదయం 10 గంటల నుంచి, సెప్టెంబరు 25 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. వివరాలకు www.karmic.andaman.gov.in వెబ్సైట్ సంప్రదించాలి.