ఇండియన్‌ ఆయిల్‌లో 470 ఉద్యోగాలు: ఇంజనీరింగ్, డిప్లొమా చేసినోళ్లకు మంచి ఛాన్స్.. పూర్తి వివరాలివే!

 ఇండియన్‌ ఆయిల్‌లో 470 ఉద్యోగాలు:  ఇంజనీరింగ్, డిప్లొమా చేసినోళ్లకు మంచి ఛాన్స్.. పూర్తి వివరాలివే!

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇ (IOCL) గ్రాడ్యుయేట్ ఇంజినీర్, ఆఫీసర్ (మార్కెటింగ్), లా ఆఫీసర్, అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్, డిప్లొమా ఇంజినీర్ అనే ఐదు విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికే షన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఆన్ లైన్  ద్వారా అప్లయ్ చేయవచ్చు. అప్లికేషన్ ప్రక్రియ ఆగస్టు 14న ప్రారంభమైంది. సెప్టెంబర్ 3న ముగియనున్నది.

మొత్తం ఖాళీలు: 470.

విభాగాల వారీగా ఖాళీలు
గ్రేడ్-A (411): సివిల్ 62, కెమికల్ 16, ఎలక్ట్రికల్ 75, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ 32, మెకానికల్ 118, ఇనుస్ట్రుమెంటేషన్ 35, కంప్యూటర్ సైన్స్ & ఐటీ 22, లా 10, మార్కెటింగ్ 41. 

గ్రేడ్-A0 (9): క్వాలిటీ కంట్రోల్ (కెమిస్ట్రీ). 


గ్రేడ్-E0 (50): ఎలక్ట్రికల్  14, మెకానికల్  21, సేఫ్టీ 15.
 
ఎలిజిబిలిటీ 
గ్రాడ్యుయేట్ ఇంజినీర్ (గ్రేడ్- A): గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్ & ఐటీ, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికే షన్, ఇనుస్ట్రుమెంటేషన్, మెకానికల్ ఇంజినీరింగ్లో బి.టెక్/సమాన డిగ్రీ కలిగి ఉండాలి.
ఆఫీసర్ (మార్కెటింగ్) గ్రేడ్- A: మార్కెటింగ్ మేనేజ్ మెంట్ లో స్పెషలైజేషన్తో ఎంబీఏ/ పీజీడీబీఏ పూర్తిచేసి ఉండాలి.
జనరల్ /ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీ డబ్ల్యూబీడీ అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులు సాధించాలి.

లా ఆఫీసర్ (గ్రేడ్-A): గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీతోపాటు ఎల్ఎల్బీ లేదా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బీ పూర్తిచేసి ఉండాలి. జనరల్ / ఈడబ్ల్యూఎస్ / ఓబీసీ అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీ డబ్ల్యూబీడీ అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులు సాధించాలి. కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.

అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ (గ్రేడ్- A0): కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ (ఇన్ఆర్గానిక్ / ఆర్గానిక్ / అనలిటికల్ / ఫిజికల్ / అప్లైడ్ / ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ) కలిగి ఉండాలి. జనరల్ / ఈడబ్ల్యూఎస్ /ఓబీసీ అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులు సాధించాలి. కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.

డిప్లొమా ఇంజనీర్ (గ్రేడ్ E0): ఎలక్ట్రికల్, మెకానికల్ లేదా సేఫ్టీ సంబంధిత విభాగాల్లో మూడేళ్ల డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. జనరల్ / ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ అభ్యర్థులు కనీసం 65 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ/ ఎస్టీ/పీడ బ్ల్యూబీడీ అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులు సాధించాలి. కనీసం ఏడాది అనుభవం ఉండాలి. బీఈ/బి.టెక్, ఎంబీఏ, సీఏ, సీఎస్, సీఎంఏ, ఎంసీఏ లేదా పీహెచ్ఎ వంటి ఉన్నత వృత్తిపరమైన అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుకు అనర్హులు.

గరిష్ట వయోపరిమితి
గ్రాడ్యుయేట్ ఇంజినీర్ (గ్రేడ్A), ఆఫీసర్ (మార్కెటిం గ్) గ్రేడ్ A. 26 ఏళ్లు, లా ఆఫీసర్ (గ్రేడ్), అసిస్టెం ట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ (గ్రేడ్ A0) 30 ఏళ్లు. డిప్లొమా ఇంజినీర్ (గ్రేడ్ E0) 28 ఏళ్లు ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు  పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: ఆగస్టు 14.

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 3.

సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), గ్రూప్ డిస్కషన్ (జీడీ) & గ్రూప్ టాస్క్ (జీటీ), పర్సనల్ ఇం టర్వ్యూ ఆధారంగా  అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్: 2026, సెప్టెంబర్ 24.

మరిన్ని వివరాలకు వెబ్ సైట్  www.iocl.comను సందర్శించండి.

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)
కంప్యూటర్ బేస్డ్ టెస్టులో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 150 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. సెక్షన్-ఏలో క్వాంటి టేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 20 ప్రశ్నలు 20 మార్కు లకు, లాజికల్ రీజనింగ్ నుంచి 15 ప్రశ్నలు 15 మార్కులకు, వెర్బల్ ఎబిలిటీ (ఇంగ్లిష్) నుంచి 15 ప్రశ్నలు 15 మార్కులకు, సెక్షన్-బీలో సంబంధిత పోస్టులకు సంబంధించిన టెక్నికల్ విభాగం నుంచి 50 ప్రశ్నలు 50 మార్కులకు ఇస్తారు. నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.

కనీస అర్హత మార్కులు: జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీలకు 40 శాతం, ఎస్సీ/ ఎస్టీలకు 35 శాతం, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 25 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.

స్కోర్ వెయిటేజీ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) 85 శాతం, గ్రూప్ డిస్కషన్ (జీడీ) & గ్రూప్ టాస్క్ (జీటీ) 5 శాతం, పర్సనల్ ఇంటర్వ్యూకు 10 శాతం వెయిటేజీ ఇచ్చారు.