ఏసీబీ వలలో ఇద్దరు మహిళా ఆఫీసర్లు.. ఒకరు రూ.4 లక్షలు.. ఇంకొకరు రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ..

ఏసీబీ వలలో ఇద్దరు మహిళా ఆఫీసర్లు.. ఒకరు రూ.4 లక్షలు.. ఇంకొకరు రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ..
  • బిల్డింగ్ ​కట్టుకోవడానికి రూ.4 లక్షలడిగిన జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ టౌన్ ​ప్లానింగ్ ​సూపర్​వైజర్

గండిపేట, వెలుగు: ఎల్బీనగర్​లో ఓ ఫిజియోథెరపీ సెంటర్‌‌‌‌‌‌‌‌ను తిరిగి ప్రారంభించేందుకు అనుమతించే విషయంలో రూ.2 లక్షలు లంచం డిమాండ్ ​చేసిన రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్​వో డాక్టర్​ స్వర్ణకుమారి ఏసీబీకి చిక్కారు. ఎల్బీనగర్ పరిధిలో సరైన లైసెన్స్ లేదని ఇటీవల ఒక ఫిజియోథెరపీ సెంటర్‌‌‌‌‌‌‌‌ను సీజ్ చేశారు.

రీ-ఓపెన్ చేయడానికి, కొత్త లైసెన్స్ మంజూరు చేయడానికి డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో రూ. 2 లక్షలు డిమాండ్ చేశారు. మొదటి విడతగా రూ. లక్ష ఇచ్చేందుకు ఒప్పందం జరిగింది. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో స్పెషల్​టీమ్ నిఘా పెట్టింది.

డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో సూచనలతో బాధితుడు రూ.లక్షను ఎల్బీనగర్లో హెల్త్ ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌కు ఇవ్వగా, అతడు డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో ప్రైవేట్ కార్ డ్రైవర్ మద్దూరి కృష్ణయ్యకు ఇవ్వగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌‌‌‌‌‌‌‌గా పట్టుకుంది. కలెక్టరేట్ ఆవరణలో ఉన్న డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో ఆఫీసులో రైడ్స్​చేశారు. 

డీఎంహెచ్​వో స్వర్ణకుమారితో పాటు , హెల్త్​ ఇన్​స్పెక్టర్​ శ్రీనివాస్​, ​డ్రైవర్ ​కృష్ణయ్యను అదుపులోకి తీసుకున్నారు. అబ్దుల్లాపూర్​మెట్​లోని డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌ఓ ఇంట్లోనూ సోదాలు చేసి కీలకమైన దస్తావేజులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

బిల్డింగ్ ​కట్టుకో.. ఏమన..
మెహిదీపట్నం:  ఓ భవన నిర్మాణదారుడి నుంచి రూ.4 లక్షల లంచం తీసుకుంటూ జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ టౌన్ ప్లానింగ్ సూపర్‌‌‌‌‌‌‌‌వైజర్ ఏసీబీకి దొరికారు. గోల్కొండ జోన్ (సర్కిల్-33) మెహిదీపట్నం ఆఫీసులో టౌన్ ప్లానింగ్ సూపర్‌‌‌‌‌‌‌‌వైజర్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్న తులసీరామ్ ​సునీత ఓ భవన నిర్మాణాన్ని అడ్డుకోకుండా ఉండేందుకు లంచం డిమాండ్ చేశారు.

జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ ఇప్పటికే స్పీకింగ్ ఆర్డర్స్ జారీ చేసినప్పటికీ, వాటిని పట్టించుకోకుండా ఉండేందుకు, భవిష్యత్తులో సహకరించేందుకు రూ. 8 లక్షలు డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో సోమవారం మొదటి విడతగా రూ. 4 లక్షల లంచం సొమ్ము తీసుకుంటుండగా సునీతను ఏసీబీ సిటీ రేంజ్-1 అధికారులు  రెడ్ హ్యాండెడ్‌‌‌‌‌‌‌‌గా పట్టుకున్నారు. ఈ డబ్బే కాకుండా ఆమె వద్ద సరైన ఆధారాలు లేని మరో రూ. రెండున్నర లక్షలను స్వాధీనం చేసుకున్నారు.