లండన్: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫ్లైదుబాయ్ ఉదంతం మరవకముందే మరో ఫ్లైట్‌లో ఎమర్జెన్సీ ప్రకటన కలకలం రేపింది. లండన్ నుంచి చికాగో బయల్దేరిన బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానం (బీఏ 295) ఎమర్జెనీ ప్రకటించింది. ఆ వెంటనే విమానాన్ని తిరిగి లండన్‌కు మళ్లించినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ డేటా వెల్లడించింది. బోయింగ్ 777 విమానం సాధారణ అత్యవసర పరిస్థితిని సూచించే 7700 అనే ‘స్క్వాక్’ కోడ్‌ను ప్రసారం చేసింది.
ఫ్లైట్ ట్రాకర్ ప్రకారం, ఈ విమానం ఐర్లాండ్పైకి చేరుకున్న తర్వాత నిమిషాల వ్యవధిలోనే విమానం 37 వేల అడుగుల నుంచి 9 వేల అడుగుల ఎత్తుకు కిందకి దిగింది. అనంతరం ఆ విమానాన్ని లండన్‌లో సురక్షితంగా ల్యాండ్చేశారు. అయితే ఈ ఎమర్జెన్సీకి గల అసలు కారణం ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు.
