అడ్‌హక్‌ కమిటీ ఛైర్మన్‌గా భూఫిందర్‌ సింగ్‌ బజ్వా

అడ్‌హక్‌ కమిటీ ఛైర్మన్‌గా భూఫిందర్‌ సింగ్‌ బజ్వా

భారత ఒలింపిక్ సంఘం (IOA) డిసెంబరు 27న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) కోసం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో భూపేంద్ర సింగ్ బజ్వా ఛైర్మన్‌గా, MM సోమయ సభ్యురాలిగా, మంజుషా కన్వర్ మరొక సభ్యురాలిగా నియమితులయ్యారు. WFI కొత్త సంస్థ సస్పెన్షన్ తర్వాత క్రీడా మంత్రిత్వ శాఖ ఆదేశంపై ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఈ తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ WFI వివిధ పనులు, కార్యకలాపాలను పర్యవేక్షించనుంది.

ఈ కమిటీ కార్యకాలాపాల విషయానికొస్తే.. ఇందులో ఆటగాళ్ల ఎంపిక, అంతర్జాతీయ టోర్నమెంట్‌లకు ఆటగాళ్ల పేర్లను పంపడం, క్రీడా ఈవెంట్‌లను నిర్వహించడం, పర్యవేక్షించడం, బ్యాంక్ ఖాతాలను నిర్వహించడం వంటివి ఉంటాయి. అంతకుముందు డిసెంబర్ 24న డబ్ల్యూఎఫ్ఐలోని కొత్త ప్యానెల్ ను క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది. 2023 ప్రారంభం నుంచి క్రీడారంగంలో అల్లకల్లోలం కొనసాగుతోంది. అప్పటి ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై అనేక మంది ప్రముఖ రెజ్లర్లు నిరసన వ్యక్తం చేయడంతో పరిస్థితి బయటపడింది.