వాషింగ్టన్: ఇండియన్ ఆరిజిన్ డాక్టర్ వివేక్ మూర్తి అమెరికా సర్జన్ జనరల్‌గా మళ్లీ నియమితు లయ్యారు. ఒబామా ప్రెసిడెంట్‌గా ఉన్న టైమ్‌లో యూఎస్ సర్జన్ జనరల్‌గా మొదటిసారి పనిచేసిన వివేక్.. చిన్న వయసులో బాధ్యత లు స్వీకరించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ట్రంప్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన తరువాత వివేక్ బాధ్యత నుంచి తప్పుకున్నారు. బైడెన్ సర్కా రు ఆయనకు సర్జన్ జనరల్‌గా మరోసారి బాధ్యతలు అప్పగిం చింది. ‘నాపై నమ్మకం ఉంచి సర్జన్ జనరల్‌గా రెండోసారి బాధ్యతలు అప్పగించిన సెనేట్‌కు థ్యాంక్స్. దేశాన్ని వైరస్ మహమ్మారి బారి నుంచి బయటపడేలా చేసి, సిటిజన్స్ యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడానికి సిద్దంగా ఉన్నా’ అని వివేక్ ట్వీట్ చేశారు.
