మదర్స్ డే మర్డర్: తల్లిని హత్య చేసిన కొడుకు

మదర్స్ డే మర్డర్: తల్లిని హత్య చేసిన కొడుకు

తెల్లారితే మదర్స్ డే. తన పిల్లలతో కలిసి సరదాగా సెలబ్రేట్ చేసుకుందామనుకుంది ఆ తల్లి. కానీ తన కొడుకు చేతిలోనే హతమవుతానని ఊహించలేదు ఆ అమ్మ. మదర్స్ డే రోజు ఓ కొడుకు తన తల్లిని హత్య చేశాడు. ఈ దారుణ ఘటన అమెరికాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెల్లెరోస్ మానోర్‌లో భారత సంతతికి చెందిన పుష్కర్ శర్మ (28) అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు.  అయితే పుష్కర్ శర్మ కొన్ని మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. దాంతో అతను కొన్నిసార్లు వింతవింతగా ప్రవర్తించేవాడు. 

కాగా మదర్స్ డే రోజు ఏమైందో ఏమో కానీ.. పుష్కర్ తన తల్లి సోరజ్ శర్మ (65)ను కిందపడేసి విపరీతంగా కొట్టి.. గొంతు కోశాడు. ఆమె చనిపోయిందని నిర్దారించుకునేంతవరకు దాడి చేశాడు. అనంతరం ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పుష్కర్ ఇంట్లోంచి బయటకు వెళ్లాడు. కాసేపటికి తల్లి కిందపడి ఉండటాన్ని గమనించిన సోరజ్ కూతురు.. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చింది. అక్కడకు చేరుకున్న పోలీసులు.. సోరజ్ శర్మను లాంగ్ ఐలాండ్ జ్యూవిష్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు నిర్దారించారు.

కాగా.. ఈ ఘటనకు సంబంధించి పుష్కర్‌ శర్మను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. హత్య, లైంగిక వేధింపుల ఆరోపణలపై శర్మను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. అతనికి బెయిల్ లేకుండా అదుపులోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. నిందితుడిని మే 24న మరోసారి హాజరుపరచాలని కోర్టు తెలిపింది.

ఈ ఘటనపై శర్మ ఇంటికి పొరుగున ఉండే కెల్విన్ మాట్లాడుతూ.. ‘శర్మకు మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తెలుసు. కానీ, అతను హత్య చేస్తాడని అసలు ఊహించలేదు. శర్మ కుటుంబం మాతో పాటు ఇక్కడ ఉండే వారందరితో స్నేహపూర్వకంగా ఉంటుంది. కెల్విన్ ఇలా ప్రవర్తించడం ఇదే మొదటిసారి కాదు. అతను గతంలో కూడా ఇలా ప్రవర్తించాడు. పొరుగున ఉండే వాళ్లను ఇబ్బందులకు గురిచేశాడు. అప్పడు కూడా పోలీసులు వచ్చారు. అప్పుడు శర్మ మందులు తీసుకోవడంలేదు. అందుకే అలా ప్రవర్తించాడు. ఇప్పడు కూడా శర్మ మందులు వేసుకోకపోవడం వల్లే ఇలా జరిగి ఉంటుంది’ అని కెల్విన్ అన్నాడు.