అమెరికాలో భారత సంతతి వ్యక్తి దారుణ హత్య.. భార్య, కొడుకు ముందే తల నరికి చంపిన సహోద్యోగి

అమెరికాలో భారత సంతతి వ్యక్తి దారుణ హత్య.. భార్య, కొడుకు ముందే తల నరికి చంపిన సహోద్యోగి

అమెరికాలో ఇండియన్స్ పై దాడులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. లోలోపల పేరుకుపోతున్న జాత్యహంకార ద్వేషంతో హత్యలకు పాల్పడుతున్నారు అమెరికన్లు. ఒకవైపు ఇండియాపై యూఎస్ ప్రసిడెంట్ ట్రంప్ పెంచి పోషిస్తున్న ద్వేశానికి తోడు.. అమెరికన్ల ఉద్యోగాలు కొల్లగొడుతున్నారనే విష ప్రచారం.. భారతీయులపై దాడులకు పురిగొల్పుతోంది. గురువారం (సెప్టెంబర్ 11) భారత సంతతి వ్యక్తిని అత్యంత దారుణంగా నరికి చంపడం ఈ ద్వేషానికి పరాకాష్టగా మారిందని చెప్పవచ్చు. 

భార్య, కొడుకు చూస్తుండగా ఇండియన్ ఆరిజిన్ వ్యక్తిని క్రూరంగా నరికి చంపాడు అతని సాటి ఉద్యోగి. FBI పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చంద్రమౌళి నాగమల్లయ్య (50) అనే భారత సంతతి వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. 

టెక్సాస్ రాష్ట్రంలోని టెనిసన్ గోల్ఫ్ కోర్స్ కు సమీపంలోని డౌన్ టౌన్ సూట్స్ మోటెల్ లో జరిగింది ఈ ఘటన. మోటెల్ మేనేజర్ గా పనిచేస్తున్న నాగమల్లయ్య కింద పనిచేస్తున్న యోర్డనిస్ కోబోస్ మార్టినెజ్ అనే దుండగుడు.. నాగ మల్లయ్యను అతి కిరాతకంగా చంపేశాడు.  హంతకుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

పోలీసుల వివరాల ప్రకారం.. ఒక మహిళా కొలీగ్ తో ఉన్న మార్టినెజ్.. మోటెల్ రూమ్ ను క్లీన్ చేస్తున్నాడు. ఆ సమయంలో.. వాషింగ్ మెషీన్ పాడైందని.. దాన్ని వాడొద్దని చెప్పాడు మల్లయ్య. దీంతో నాకే చెబుతావా అంటూ కోపోద్రేకానికి గురైన మార్టినెజ్.. కత్తితో దాడి చేశాడు. మల్లయ్య వైపు చూడటానికి కూడా ఇష్టపడని మార్టినెజ్.. ట్రాన్సిలేటర్ చెప్పే మాటలు వింటూ దాడికి దిగినట్లు తెలిపారు. 

మార్టినెజ్ చంపేందుకు వెంబడిస్తుండటంతో.. కాపాడంటూ మోటెల్ మొత్తం పరిగెత్తాడు. కానీ ఆ సమయంలో ఎవరూ కాపాడలేకపోయారు. భయంతో పరిగెడుతున్న నాగమల్లయ్యను వెంటాడి వేటాడి చంపాడు దుర్మార్గుడు. తల నరికి తన్నడంతో మోటెల్ బయటకి దొర్లుతూ పడిపోయింది మల్లయ్య తల. దుండగుడు ధైర్యంగా ఒత చేత కత్తిని పట్టుకుని.. మరో చేతిలో తలను తీసుకెళ్లి చెత్త కుండీలో వేస్తున్న విజువల్స్ భయానకంగా కనిపిస్తున్నాయి.

నాగమల్లయ్య హత్యపై అమెరికాలో ఉన్న భారత రాయభార కార్యాలయం యూఎస్ అధికారులతో చర్చలు జరిపింది. మృతుడి కుటుంబ సభ్యులకు వివరాలు తెలియజేసింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారని.. కఠిన చర్యలు తీసుకునేలా.. నాగమల్లయ్య కుటంబ సభ్యులకు న్యాయం జరిగేలా చూస్తామని ఇండియన్ కాన్సులేట్ జనరల్ ప్రకటించింది. 

నాగమల్లయ్య కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి. టెక్సాస్ లోని ఒక మోటెల్ లో మేనేజర్ గా పనిచేస్తున్నట్లు భారత రాయభార కార్యాలయం ప్రకటించింది.