న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ పప్పు కాదు..ఉన్నత విద్యావంతుడని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ శామ్ పిట్రోడా అన్నారు. యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ స్టూడెంట్లకు రాహుల్ను ఆయన పరిచయం చేశారు.
సందర్భంగా పిట్రోడా మాట్లాడుతూ.. ‘‘రాహుల్ ఇమేజీని దెబ్బతీయడానికి బీజేపీ రూ.కోట్లు ఖర్చు చేస్తున్నది. కానీ వాళ్లు ప్రచారం చేస్తున్నట్టుగా రాహుల్ పప్పు కాదు. ఆయన ఉన్నత విద్యావంతుడు, మంచి వ్యూహకర్త. బాగా చదువుతారు.. లోతుగా ఆలోచిస్తారు” అని చెప్పారు.