కరోనా ఎఫెక్స్: ఇరాన్‌లో ఉన్న భారతీయులను రప్పిస్తున్న కేంద్రం

కరోనా ఎఫెక్స్: ఇరాన్‌లో ఉన్న భారతీయులను రప్పిస్తున్న కేంద్రం

చైనా తర్వాత ఎక్కువ ప్రభావం ఉన్న ఇరాన్ లో మొత్తం 2 వేల మంది ఇండియన్లు ఉన్నట్టు గుర్తించారు. వీరందరినీ ఇండియా తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమానాన్ని పంపింది భారత్. తొలి విడతగా 58 మంది భారతీయులను తీసుకుని ఐఐఎఫ్ విమానం ఇండియాకు చేరుకుంది. గజియాబాద్ ఎయిర్ పోర్టులో కొద్దిసేపటి క్రితం ల్యాండ్ అయ్యింది. దీంతో ఇరాన్ నుంచి వచ్చిన ప్రయాణికులకు ముందుగా స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించనున్నారు అధికారులు. ఇందుకోసం ప్రత్యేక డాక్టర్ల బృందం ఎయిర్ పోర్టుకు చేరుకుంది. అటు భారతీయుల తరలింపునకు సహకరించిన ఇరాన్ అధికారులకు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కృతజ్ఞతలు చెప్పారు.