75 ఏళ్ల క్రికెట్ స్నేహం.. భారత్, ఆస్ట్రేలియా నాల్గో టెస్టుకు మోడీ, ఆల్బనీస్

75 ఏళ్ల క్రికెట్ స్నేహం.. భారత్, ఆస్ట్రేలియా నాల్గో టెస్టుకు మోడీ, ఆల్బనీస్

భారత్ , ఆస్ట్రేలియా నాల్గో టెస్టుకు భారత ప్రధాని నరేంద్రమోడీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్  హాజరయ్యారు.  గుజరాత్ లోని నరేంద్ర మోడీ స్టేడియానికి విచ్చేసిన ఇద్దరు ప్రధానులకు అభిమానులు, గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు, బీసీసీఐ అధికారులు ఘన స్వాగతం పలికారు. టాస్ గెలిచిన అనంతరం స్టేడియంలో జాతీయ గీతం ప్రారంభం కాగానే ఇరు దేశాల నేతలు ఆటగాళ్లతో కరచాలనం చేసి పరిచయం చేసుకున్నారు. ప్రధాని మోడీని ఆటగాళ్లకు కెప్టెన్ రోహిత్ శర్మ పరిచయం చేశారు.  

ఆ తర్వాత ప్రధాని మోడీ, అల్బనీస్ తమ జట్టు కెప్టెన్లు రోహిత్ శర్మ, స్టీవ్ స్మిత్ లకు టెస్టు క్యాప్ లను అందజేశారు.

భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇద్దరు ప్రధానులు గోల్ఫ్ కారులో భారీ క్రీడా మైదానాన్ని పరిశీలించారు.  స్టేడియంలో తిరుగుతూ ప్రేక్షకులకు అభివాదం చేశారు. అంతకుముందు బీసీసఐ అధికారులు ఇద్దరు ప్రధానులకు జ్ఞాపికలను అందించారు. 

అంతకుముందు ఇద్దరు ప్రధానులు పీఎం ఫ్రెండ్ షిప్ హాల్ ఆఫ్ ఫేమ్ కు వెళ్లారు. అక్కడ రవిశాస్త్రి వారిద్దరికీ స్వాగతం పలికి హాల్ ఆఫ్ ఫేమ్, ఇండియా ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్ర గురించి వివరించారు.