ఇండియన్ రేసింగ్ లీగ్ ఫైనల్ రౌండ్ షురూ

ఇండియన్ రేసింగ్ లీగ్ ఫైనల్ రౌండ్ షురూ

హైదరాబాద్ : ట్యాంక్ బండ్ వద్ద ఇండియన్ రేసింగ్ లీగ్ కొనసాగుతోంది. క్యాలిఫైయింగ్ 1తో రేస్ మొదలైంది. ఎన్టీఆర్ మార్గ్ లో ఇండియన్ రేసింగ్ లీగ్ ఫైనల్ రౌండ్ జరుగుతోంది. రేసింగ్ లో 6 టీమ్స్, 12 కార్లు, 24 మంది డ్రైవర్స్ పాల్గొన్నారు. 250 నుంచి 300 మెరుపు వేగంతో స్పోర్ట్స్ కార్లు దూసుకెళ్తున్నాయి.

మరోవైపు.. ఇండియన్ రేసింగ్ లీగ్ తో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. NTR మార్గ్, నెక్లెస్ రోడ్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ కింద రాకపోకలు నిలిపివేశారు. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, ఐమ్యాక్స్ థియేటర్ల వైపు వెళ్లే వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్తున్నాయి. ట్రాఫిక్ మళ్లీంపుతో మరోసారి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.