రైల్వే ప్రయాణికులకు శుభవార్త: అందుబాటులోకి 200 స్పెషల్ ట్రైన్స్

రైల్వే ప్రయాణికులకు శుభవార్త: అందుబాటులోకి 200 స్పెషల్ ట్రైన్స్

కరోనా వైరస్ కారణంగా తొలత రైల్వే టికెట్స్ ను  ఆన్ లైన్ లో  అందుబాటులో ఉంచింది. తాజాగా ఆ నిబంధనల్ని సవరిస్తూ  రైల్వే కేంద్రాల్లో టికెట్స్ ను  బుక్ చేసుకోవచ్చని రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. అంతేకాదు జూన్ 1 నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి 200 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు చెప్పారు.

మరోవైపు ప్రయాణికుల అవసరాలు, రద్దీని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమైన మార్గాలను రైల్వే శాఖ ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ రైళ్లకు 30 రోజుల ముందుగా రిజర్వేషన్ చేయించుకోవాలి. నిబంధనల ప్రకారం ఆర్‌ఏసీ, వెయిటింగ్‌ లిస్ట్‌ టికెట్లను కూడా జారీ చేస్తారు.

ఇక వాటిలో జూన్ 1న తెలుగు రాష్ట్రాల మీదుగా నడిపే రోజువారీ రైళ్ల వివరాలను రైల్వే బోర్డు ఆన్‌లైన్‌లో వెల్లడించింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

(02701) – హైదరాబాద్ – ముంబయి

(02703) – హౌరా – సికింద్రాబాద్‌

(02805 )–విశాఖపట్నం- ఢిల్లీ

(02723 ) –హైదరాబాద్‌- న్యూఢిల్లీ

(02791 )–దానాపూర్‌- సికింద్రాబాద్‌

(07201)- గుంటూరు- సికింద్రాబాద్‌

(02793) – తిరుపతి- నిజామాబాద్‌

(02727)- హైదరాబాద్‌- విశాఖపట్నం

(02175) – నాందేడ్ – అమృత్ సర్