షూటర్ల గురి కుదరలే.. ISSF వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిరాశపర్చిన ఇండియా షూటర్లు

షూటర్ల గురి కుదరలే.. ISSF వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిరాశపర్చిన ఇండియా షూటర్లు

నింగ్బో (చైనా): ఐఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా షూటర్ల నిరాశజనక ప్రదర్శన కొనసాగుతోంది. గురువారం జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 10 మీటర్ల ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైఫిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వాలిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దివ్యాన్ష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పన్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 630 పాయింట్లతో 19వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఉమామహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మద్దినేని (627.7), నీరజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (626.1) వరుసగా 39, 54వ స్థానాల్లో నిలిచారు. 

అయితే ఫైనల్లో ఇటలీ షూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డానిలో సోలాజో 255 పాయింట్లతో వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రికార్డును బద్దలు కొట్టి గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెగ్గాడు. గతంలో షెంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిహావో నెలకొల్పిన రికార్డును 0.5 తేడాతో అధిగమించాడు. ప్రస్తుత పోరులో లిహావో, పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైజున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరుసగా సిల్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బ్రాంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సాధించారు. విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 25 మీటర్ల పిస్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ర్యాపిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వాలిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అభింద్య అశోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (583), దివ్య టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (581), సర్నోబాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (581) వరుసగా 11, 16వ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో నిరాశపర్చారు.