జమ్మూలో అనుమానాస్పద సిలిండర్‌ కలకలం

జమ్మూలో అనుమానాస్పద సిలిండర్‌ కలకలం

జమ్మూలోని అఖ్నూర్ సెక్టార్‌లో అనుమానాస్పద సిలిండర్‌ను భారత సైనికులు గుర్తించారు. వెంటనే బాంబు స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. కాసేపు భద్రతా బలగాలు రోడ్డును మూసివేసి రాకపోకలను నిలిపివేశారు. సిలిండర్ ను సురక్షిత ప్రాంతానికి తరలించి నిర్విర్యం చేశారు. ఈ సిలిండర్‌ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. దోమన అసెంబ్లీ నియోజకవర్గంలోని కానా చక్క్ పోలీస్ స్టేషన్ పరిధిలో పరాగ్వల్‌ రోడ్‌ సమీపంలో ఈ సిలిండర్‌ను స్వాధీనం చేసుకున్నారు.