మా పెండ్లి ప్లాన్‌‌‌‌ దెబ్బతిన్నది

మా పెండ్లి ప్లాన్‌‌‌‌ దెబ్బతిన్నది

భువనేశ్వర్‌‌‌‌:  స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించడంతో తాను అసంతృప్తి చెందానని ఇండియా స్టార్‌‌‌‌ స్ప్రింటర్ ద్యుతీ చంద్ చెప్పింది. ఐదేండ్లుగా సహజీవనం చేస్తున్న తన పార్ట్‌‌‌‌నర్‌‌‌‌ మోనాలిసాను పెండ్లి చేసుకోవాలన్న ప్లాన్‌‌‌‌ ఈ తీర్పుతో దెబ్బతిన్నదని తెలిపింది. ‘నేను నా  పార్ట్‌‌‌‌నర్‌‌‌‌ మోనాలిసాను పెండ్లి  చేసుకోవాలనుకుంటున్నా. 

అయితే సుప్రీంకోర్టు తీర్పు మా ప్లాన్​ను తలకిందులు చేసింది.  మోనాలిసాతో ఐదేండ్లుగా సంతోషంగా ఉన్నా. పరిణితి కలిగిన వ్యక్తులుగా సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు మాకు ఉంది. అయితే, స్వలింగ వివాహాలను అనుమతించేలా పార్లమెంటు ఒకచట్టం తెస్తుందని  మేము ఆశిస్తున్నాం’ అని ద్యుతీ తెలిపింది.